Skin Care Routine Mistakes: వానాకాలంలో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ముఖం అందహీనంగా మారడమేకాకుండా చాలా రకాల చర్మ సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో మొటిమల సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ మొటిమల సమస్యలు క్రమంగా పెరిగే తప్పకుండా ఈ కింది చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలు పాటిస్తే సులభంగా మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ చిట్కాలు తప్పకుండా పాటించాలి:
తప్పుడు చర్మ సంరక్షణ ఉత్పత్తులను వినియోగించడం మానుకోవాలి:
అందరు చర్మాన్ని బట్టి చర్మ సంరక్షణ ఉత్పత్తులను వినియోగించాల్సి ఉంటుంది. కానీ కొంత మంది ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇలా వినియోగించడం వల్ల మొటిమల సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే మొటిమల సమస్యలతో బాధపడేవారు వీటిని వినియోగించకపోవడం చాలా మంచిది.
హానికరమైన మేకప్ ప్రోడక్ట్స్ వినియోగం:
రసాయనాలతో కూడిన హానికరమైన మేకప్ ప్రోడక్ట్స్ వినియోగించడం వల్ల ముఖానికి ఆక్సిజన్ అందక తీవ్ర చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా మంది వీటినే వినియోగిస్తున్నారు. ఇలాంటి ఉత్పత్తులను వినియోగించడం మానుకోవాల్సి ఉంటుంది.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
క్లెన్సర్ వినియోగంపై శ్రద్ధ తీసుకోవాలి:
మార్కెట్‌లో చాలా రకాల క్లెన్సర్ లభిస్తున్నాయి. అయితే రసాయనాలతో కూడిన క్లెన్సర్ వినియోగం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్కిన్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేసే క్లెన్సర్‌ను వినియోగించకూడదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
వైప్స్‌తో మాత్రమే మేకప్ తొలగించాల్సి ఉంటుంది:
చాలా మంది మేకప్ వేసుకున్న తర్వాత వైప్స్‌ను వినియోగించకుండా మేకప్స్‌ను తొలగిస్తున్నారు. అయితే మేకప్‌ను తొలగించే క్రమంలో తప్పకుండా ఫేస్ వాష్‌తో కూడిన వైప్స్‌ను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook