Singer Mangli Fathers Day 2021 Song In Telugu: నాన్న.. మనం గుర్తించలేని దైవం, స్నేహితుడు, శ్రేయోభిలాషి.. పిల్లల జీవితం కోసం తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరింగించే వ్యక్తి తండ్రి. ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారాన్ని అంతర్జాతీయ పితృ దినోత్సవం (International Fathers Day) జరుపుకుంటాం. 1910లో తొలిసారిగా ఫాదర్స్ డే నిర్వహించి తండ్రుల సేవలకు తగిన గుర్తింపునిచ్చారు. 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ నెలలో మూడో ఆదివారాన్ని పురస్కరించుకుని పలు దేశాలు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.
ఈ ఫాదర్స్ డే 2021ను పురస్కరించుకుని సింగర్ మంగ్లీ తన గాత్రంతో మరోసారి అదరగొట్టింది. టీఎఫ్‌సీసీ లైవ్ తమ యూట్యూబ్ ఛానల్‌లో ఫాదర్స్ డే 2021 పాటను తీసుకొచ్చింది. డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సాహిత్యం అందించిన ఈ ‘చిటికన వేలు పట్టి చింతల్లో వెన్ను తట్టి’ పాటకు సింగర్ మంగ్లీ ప్రాణం పోసింది. మంగ్లీ పాడిన ఫాదర్స్ డే 2021 సాంగ్ ఇక్కడ వీక్షించండి. (Song Credit: TFCC LIVE Youtube)
‘చిటికన వేలు పట్టి చింతల్లో వెన్ను తట్టి
చిరునవ్వులను పంచేవాడే నిను కన్నతండ్రి
నీ భుజాలపైనా మోసే దేవుడు నాన్న
నిను సన్మార్గంలో నడిపే దిక్సూచి నాన్నా
నాన్నకు మించిన నేస్తం లేడు లోకానా
తన జీవితమంతం పిల్లలకోసం తపియించేవాడు నాన్న’ అంటూ సింగర్ మంగ్లీ తండ్రి ప్రేమ, ప్రాధాన్యాత, గౌరవాన్ని పాట రూపంలో పాడి మనకు వినిపించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook