Hair Growth Tips: జుట్టు ఎక్కువగా రాలుతుందా.. అయితే పార్లర్లకు తిరక్కుండా..ఇలా చేయండి!

Hair Fall Remedies : ఈమధ్య చాలా మంది యువత ఇబ్బంది పడుతున్నది హెయిర్ ఫాల్ వల్లనే. విపరీతమైన హెయిర్ ఫాల్ కారణంగా.. జుట్టులో దువ్వెన పెట్టడానికే భయపడతారు. అలాంటి వాళ్ల కోసమే కొన్ని అద్భుతమైన హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని వాడితే జుట్టు నల్లగా బలంగా మారుతుందట.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 30, 2024, 05:39 PM IST
Hair Growth Tips: జుట్టు ఎక్కువగా రాలుతుందా.. అయితే పార్లర్లకు తిరక్కుండా..ఇలా చేయండి!

Hair Fall Pack : ఈ మధ్యకాలంలో కాలుష్యం వల్ల, సరైన ఆహారం తినకపోవడం వల్ల, ఇలా ఎన్నో కారణాల వల్ల జుట్టు సంబంధిత సమస్యలు వస్తూనే ఉన్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ చెబుతున్న మొదటి కంప్లైంట్.. జుట్టు బాగా ఊడిపోతుంది అని. జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. జుట్టు ఊడిపోతుంది అని చాలామంది పార్లర్ల చుట్టూ తిరుగుతూ.. ఏవో హెయిర్ ట్రీట్మెంట్లు అంటూ.. ఎంతో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు. 

ఎంత ఖర్చు పెట్టినప్పటికీ జుట్టులో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. కానీ కేవలం మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో.. మనం ఇంట్లోనే చక్కగా హెయిర్ ప్యాక్స్ చేసుకొని వాడొచ్చు. ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి.. ఈ హెయిర్ ప్యాక్స్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. కచ్చితంగా హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. ఈ నేచురల్ చిట్కాలతో హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గిపోయి.. మీ జుట్టు నల్లగా పొడవుగా పెరుగుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటో ఒకసారి చూసేద్దాం..

కాఫీ పొడి ప్యాక్

ఉదయం లేవగానే అన్నిటికంటే ముందు మనం తాగేది కాఫీ. కాఫీ ఫ్లేవర్ ఉదయాన్నే మనకి కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది. కానీ చెంచా కాఫీ పొడిలో జుట్టు రాలడం నియంత్రించగల శక్తి కూడా ఉంది. ఒక చెంచా కాఫీ పొడి లో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ లో ఉండే లిక్విడ్ ని కలిపి.. మాడుకి బాగా పట్టేలాగా రాయాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ఒత్తైన జుట్టు మీ సొంతం.

కరివేపాకు ప్యాక్

అందమైన జుట్టు కోసం కరివేపాకు ఒక దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. ఉదయం లేచాక ఒక రెమ్మ కరివేపాకులు నోట్లో వేసుకున్నా.. జుట్టుకి ఎంతో మంచిది అని.. చాలామంది చెబుతూ ఉంటారు. కరివేపాకు ఆకులను దంచుకొని ముద్దగా చేసుకోవాలి. దాంట్లో కొంచెం పెరుగు, కొంచెం బాదం ఆయిల్ వేస్తే హెయిర్ ప్యాక్ రెడీ అవుతుంది. దానిని తలకి బాగా పట్టించి తలంటుకుంటే.. మన జుట్టు స్మూత్ గా మారుతుంది. ఒత్తుగా కనిపిస్తుంది. 

తమలపాకుల ప్యాక్

తమలపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఒక 10 తమలపాకులు మిక్సీలో వేసి పేస్టులా చేసుకున్నాక, దాంట్లో మూడు చెంచాల నెయ్యి, కొంచెం తేనె కలిపి తలకు రాసుకొని ఆరనివ్వాలి. ఆరిపోయాక గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. కచ్చితంగా జుట్టు ఊడటం చాలా వరకు తగ్గిపోతుంది. 

కలబంద ప్యాక్

ముఖానికి మాత్రమే కాక కలబందలో ఉన్న ఔషధ గుణాలు మన జుట్టుని కూడా.. పొడిబారికోకుండా, చుండ్రు, ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా కాపాడతాయి. కలబంద గుజ్జుని తలకు బాగా పట్టించి.. కాసేపు అయ్యాక స్నానం చేస్తే జుట్టు చాలా స్మూత్ గా మారుతుంది. 

ఉల్లిపాయ ప్యాక్

ఒక పెద్ద ఉల్లిపాయను మిక్సీ పట్టి వచ్చిన రసాన్ని మాడుకి పట్టించి.. ఒక పావుగంట తరువాత తలస్నానం చేస్తే.. కుదుళ్ళు ఆరోగ్యంగా మారి జుట్టు ఊడటం తగ్గిపోతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఇక ఎసెన్షియల్ ఆయిల్స్ రాయడం వల్ల కూడా జుట్టు ఊడటం ఆగిపోతుంది. ముఖ్యంగా రోజ్ మేరీ, లావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ లో ఉన్న యాంటీ మైక్రోబియల్ అంశాలు మన మాడుని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతూ, కుదుళ్లను ద్రుడ పరుస్తాయి. 
ఇలా ఇంట్లో దొరికే వాటితోనే అద్భుతమైన హెయిర్ ప్యాక్స్ రెడీ చేసుకోవచ్చు. జుట్టు కోసం ఎక్కడికో వెళ్లకుండా ఇంట్లోనే ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటూ జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News