Side Effects Of Eating Too Many Oranges: నారింజ పండును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చిన్న నుంచి పెద్దవారి దాకా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీని రుచి తీపి, పులుపుతో కూడుకుని ఉంటుంది. అయితే ఈ పండును ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు కొన్ని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, విటమిన్ ఎ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అధిక మోతాదులో లభిస్తాయి. అయితే చాలా మందిలో ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయని నారింజను అతిగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అతిగా నారింజ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
అసిడిటీ:
నారింజను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట లేదా ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో అధిక మొత్తంలో యాసిడ్ ఉంటుంది. కాబట్టి తీవ్ర పొట్ట సమస్యలకు దారి తీసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోవడం మానుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్:
ఇంతక ముందే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నారింజను ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
దంతాలు దెబ్బతింటాయి:
చాలా మందిలో నారింజను అతిగా తీసుకోవడం వల్ల దంతాలు కూడా తీవ్రంగా దెబ్బతినే ఛాన్స్‌లు ఉన్నాయి. నారింజలో ఉండే యాసిడ్ పళ్ల ఎనామిల్‌లో ఉండే కాల్షియంతో కలిసి బ్యాక్టీరియాపై ప్రభావం చూపి తీవ్ర దంతాల సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉన్నాయి. దీని కారణంగా దంతాలలో కుహరం సమస్య ఏర్పడవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
కడుపు తిమ్మిర్లు:
నారింజలో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపులో తిమ్మిర్లు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి నారింజ పండ్లను ప్రతి రోజు తినాలనుకునేవారు ప్రతి రోజు రెండు మాత్రమే తీసుకుంటే శరీరానికి చాలా మంచిది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి