saffron benefits for men: శారీరక బలహీనతతో బాధపడుతున్నారా..ఇవి నానబెట్టుకుని తాగండి..!!

saffron benefits for men: కుంకుమపువ్వు పురుషుల వైవాహిక జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. శరీర బలహీన సమస్యలతో బాధపడుతున్నవారికి విముక్తి కలిగిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని దృఢంగా చేస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 11:23 AM IST
  • శారీరక బలహీనతతో బాధపడుతున్నారా..
  • కుంకుమ పువ్వు నానబెట్టిన నీటిని తాగండి
  • అన్ని రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు
saffron benefits for men: శారీరక బలహీనతతో బాధపడుతున్నారా..ఇవి నానబెట్టుకుని తాగండి..!!

saffron benefits for men: కుంకుమపువ్వు పురుషుల వైవాహిక జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. శరీర బలహీన సమస్యలతో బాధపడుతున్నవారికి విముక్తి కలిగిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని దృఢంగా చేస్తుంది. అయితే కుంకుమ పువ్వును రకరకాలు వినియోగిస్తారు. కొందరు ఆహారంలో వినియోగిస్తే..మరి కొందరు దీనిని నానబెట్టిన నీటిని తాగుతారు. ఈ పువ్వును నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి కుంకుమపువ్వు నీరు తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఈ వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు:

భారత్‌లో కుంకుమ పువ్వును రకరకాలుగా వినియోగిస్తారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి  పోషకాలు ఉంటాయి. కావున శరీరానికి శక్తి ఇవ్వడమే కాకుండా వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

మహిళలకు ఎంతో ప్రయోజనం:

పీరియడ్స్ సమయంలో చాలా మంది నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి నాలుగైదు కుంకుమపువ్వులను నీటిలో వేసి మరిగించి, తాగితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది:

కుంకుమపువ్వు నీరు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి, ముఖానికి మొటిమలు రాకుండా చేస్తుంది.

(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)

Also Read: Thyroid Control Juice: ఈ మూడు జ్యూస్‌లు తాగండి..థైరాయిడ్‌ నుంచి ఉపశమనం పొందండి.!!

Also Read: Benefits of Moringa Leaves: మునగ ఆకు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News