Rid Skin Problems In 2 Days: వర్షాకాలంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసతరం ఎందుకంటే.. వాతావరణంలో తేమ వల్ల వివిధ రకాల చర్మ వ్యాధులు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో చాలా మందికి మొటిమల సమస్య వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చర్మం నిర్జీవంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అయితే ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో బొప్పాయి తొక్కతో చేసిన మిశ్రమం ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలిపారు. అయితే దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి కావాల్సి పదార్థాలు:
>>బొప్పాయి తొక్కలు
>>క్రీమ్
>>నిమ్మరసం
ఈ మిశ్రమాన్ని ఇలా తయారు చేయండి:
బొప్పాయి తొక్క నుంచి ఫేస్ ప్యాక్ చేయడానికి.. ముందుగా బొప్పాయి తొక్కను తీసుకుని బ్లెండర్లో వేసి బాగా పేస్ట్‌లా సిద్ధం చేసుకోండి. తర్వాత ఈ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నిమ్మరసం వేసి.. 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఫేస్‌కు అప్లై చేయండి.
ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు:
బొప్పాయి తొక్క చేసిన మిశ్రమం చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీనిని చర్మానికి క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తూ.. చనిపోయిన చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ సి, ఫోలేట్ కంటెంట్ మీ చర్మం హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయితే పాల క్రీమ్‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మృదువైన చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది.
Also Read: Disadvantages Of Salad: పుట్టగొడుగు, క్యాబేజీ, బ్రోకలీలను ఉడికించకుండా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!
Also Read: Weight Loss Home Remedy: పాలలో తేనె కలుపుకుని తాగితే.. ఐదు రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..!
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.