How To Remove White Hair Naturally: ప్రస్తుతం చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా 20 సంవత్సరాలు నిండిన వారిలో కూడా ఇలాంటి సమస్యలు వస్తునాయి. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే చాలా రకాల హెయిర్ డైస్‌ను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల కేవలం పరిమిత కాలం మాత్రమే నల్ల జుట్టు పొందుతున్నారు. ఆ తర్వాత జుట్టు తెల్లగా మారుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ నూనెను వినియోగించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
తెల్ల జుట్టుకు సోంపు నూనెను వినియోగించండి చాలు:
చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టుకు సోంపు నూనెను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నూనెను ప్రతి రోజు జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
ఫెన్నెల్ నూనె తెల్ల జుట్టును తగ్గిస్తుందా?:
సోంపు నూనెలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని వినియోగించడం వల్ల తీవ్ర జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నూనెను వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు నూనె తయారి పద్ధతి:
✾ ½ కప్పు సోంపు
✾ కొబ్బరి లేదా ఆలివ్ నూనె
సోంపు నూనె తయారి విధానం:
✾ సోంపు నూనెను తయారు చేయడానికి ముందుగా ఒక కప్పును తీసుకోవాల్సి ఉంటుంది.
✾ ఆ తర్వాత స్టౌవ్‌పై బౌల్ పెట్టి అందులో ఆలివ్ లేదా కొబ్బరి నూనెను పోసి వేడి చేయాలి.
✾ ఇలా చేసిన తర్వాత సోపు గింజలు వేసి నూనెను మరిగించాల్సి ఉంటుంది.
✾ ఇలా మరిగించిన తర్వాత ఓ బాటిల్ నూనెను పోసుకుని, మీకు వీలునప్పుడు తెల్ల జుట్టుకు ఈ నూనె అప్లై చేయాలి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook