Palakura Pakoda Recipe: పాలకూరకు వైద్యులు పోషకాల గనిగా భావిస్తారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు లభిస్తాయి. కాబట్టి వారంలో రెండు నుంచి మూడు సర్లైనా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలకూరలో విటమిన్ Aతో పాటు విటమిన్ C, విటమిన్ K1, విటమిన్ B9 అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇందులో విటమిన్ B6 కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి. అయితే చాలా మంది ఈ పాలకూరతో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది హెల్తీ స్నాక్‌లో భాగంగా పాలకూర పకోడీని తయారు చేసుకుని తింటూ ఉంటారు.
నిజానికి పాలకూరతో తయారు చేసిన పకోడీని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి క్రమం ఇంట్లో తయారు చేసుకుని తింటే అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇంట్లోనే సులభంగా ఈ పాలకూర పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాలకూర పకోడీ తయారీ విధానం:
పదార్థాలు:
పాలకూర - 1 కట్ట (బాగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా తరిగిన)
బెసన్ (శనగపిండి) - 1 కప్పు
బియ్యప్పిండి - 1/4 కప్పు
ఉల్లిపాయ - 1 (తరిగిన)
అల్లం-పసుపు - 1 స్పూను
పచ్చిమిరపకాయలు - 2-3 (తరిగిన)
కొత్తిమీర - కొద్దిగా (తరిగిన)
కారం - 1/2 స్పూను
ఉప్పు - రుచికి తగినంత
వేయించడానికి నూనె
తయారీ విధానం:
ఈ పాలకూర పకోడీను తయారు చేయడానికి ముందుగా ఒక పాత్రలో బెసన్, బియ్యప్పిండి, ఉప్పు, కారం, అల్లం-పసుపు కలిపి మిక్స్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అదే మిశ్రమంలో తరిగిన పాలకూర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా చేసిన తర్వాత కావలసినంత నీరు కలిపి బాగా మిక్స్ చేసుకుని.. దాదాపు 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.
ఆ తర్వాత వేయించడానికి ముందుగా స్టౌవ్‌పై బౌల్ పెట్టుకుని అందులో కావాల్సినంత నూనె వేసుకుని బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా వేడి చేసుకున్న నూనెలో పిండిని పకోడీలా వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఖాళీ గిన్నెలో వేసుకోండి. అంతే రుచికరమైన హెల్తీ పకోడా రెడీ అయినట్లే..
చిట్కాలు:
పకోడీలు క్రిస్పీగా ఉండాలంటే పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా కలపడం చాలా మంచిది..
పాలకూరను బాగా నీరు పోసి కడిగి ఆకులు ఆరిపోయేంత వరకు గాలి ఉంచాల్సి ఉంటుంది.
పిండిలో కొద్దిగా బియ్యప్పిండి వేసి పకోడీలు మరింత క్రిస్పీగా ఉండేట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
వేయించేటప్పుడు నూనె మధ్యస్థ ఉష్ణోగ్రతలో ఉండేలా చూసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.