Okra Water Benefits For Skin: పచ్చి కూరగాయలు శరీరానికి ఎంత మేలు చేస్తాయో చర్మానికి కూడా అన్నే లాభాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చర్మానికి ప్రతి రోజు బెండకాయతో తయారు చేసిన నీటిని వినియోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఓక్రా వాటర్‌లో చర్మానికి సంబంధించిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ బి6 అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ ఓక్రా వాటర్‌ను ప్రతి రోజు చర్మానికి వినియోగించడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మ సమస్యలు దూరమవుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:
బెండకాయలో ఉండే జెల్ లాంటి మిశ్రమంలో విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని వల్ల చర్మ సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని ముఖానికి వినియోగించడం వల్ల UV కిరణాల ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా కాంతివంతమైన చర్మాన్ని తయారు చేయడానికి సహాయపడుతుంది.
మొటిమల సమస్యలకు చెక్:
ముఖంపై మొటిమల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఓక్రా జెల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మంపై ఇన్ఫెక్షన్, ఫంగల్, బ్యాక్టీరియా తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
చర్మం పొడిబారడం తగ్గుతుంది:
చర్మం పొడి బారడం సమస్యలతో బాధపడేవారు కూడా ఈ ఓక్రా వాటర్‌ను వినియోగించవచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు చర్మంపై సహజ గ్లోను అందించేందుకు కూడా సహాయపడుతుంది.
ముడతలు తొలగిపోతాయి:
ఓక్రా వాటర్‌ను ప్రతి రోజు వినియోగించడం వల్ల చర్మం హైడ్రేట్‌గా మారుతుంది. అంతేకాకుండా వృద్ధాప్య కారణంగా వచ్చే ఫైన్ లైన్స్ సులభంగా తొలగిపోతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook