Never Eat These fruits Seeds: ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు, పండ్లు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొంత మంది ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు, కూరగాయలు, ఎండిన పండ్లను తీసుకుంటారు. అయితే ప్రస్తుతం ఇలా తీసుకునే క్రమంలో తినకూడని గింజలను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యతో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పండ్లలో ఉండే విత్తనాలు తీసుకోకపోవడం చాలా మంచిది.
ఈ పండ్ల విత్తనాలు తీసుకోవడం మానుకోవాలి:
టమోటో విత్తనాలు:
టమోటో గింజలు చాలా చిన్నవిగా, ఎక్కువగా గుజ్జులో చుట్టుకొని ఉండడం మీరు చూడవచ్చు..వెజిటేబుల్ లేదా సలాడ్, ప్యూరీలో తరచుగా వినియోగిస్తు ఉంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లతో పాటు జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకోవడం మానుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్ర నొప్పి కారణంగా వాపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
యాపిల్ గింజలు:
యాపిల్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని ఆరోగ్య నిపుణులు తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. అయితే చాలా మంది యాపిల్స్ తినే క్రమంలో వాటి గింజలను కూడా తింటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని తీసుకోవడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ విత్తనాల నిండా విషం ఉంటుందని..వీటిని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే వీటిని తినడం వల్ల కొందరిలో ప్రాణాంతకంగానూ మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 1 కిలో 15.2 మిల్లీగ్రాములుగా విత్తనాలు తినేవారిలోనే ప్రాణాంతక సమస్యల వస్తాయట..
లిచీ గింజలు:
లిచీ పండ్లు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే వీటిలో ఉండే గింజలు తీసుకోవడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లిచీ గింజలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. వీటిని మధుమేహం సమస్యలతో బాధపడేవారు తింటే ప్రాణాంతకంగా మరే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మెదడులో మంట వంటి సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి