Neem Skin Benefits: చర్మాన్ని చమక్కుమనిపించే వేప.. మన స్కిన్‌పై ఎలా పనిచేస్తుందో తెలిస్తే షాక్..!

Neem Skin Benefits: వేప ఒక అద్భుతం. తరతరాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. వేప ముఖానికి అప్లై చేయడం వల్ల సౌందర్యపరంగా ఎన్నో లాభాలు చేయకూరుతాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 28, 2024, 10:17 AM IST
Neem Skin Benefits: చర్మాన్ని చమక్కుమనిపించే వేప.. మన స్కిన్‌పై ఎలా పనిచేస్తుందో తెలిస్తే షాక్..!

Neem Skin Benefits: వేప ఒక అద్భుతం. తరతరాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. వేప ముఖానికి అప్లై చేయడం వల్ల సౌందర్యపరంగా ఎన్నో లాభాలు చేయకూరుతాయి. వేప మన స్కిన్ కేర్ లో ఐదు ప్రయోజనాలు ఎలా ఇస్తుందో తెలుసుకుందాం. వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. వేపను సాధారణంగా ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది ఎఫెక్టీవ్‌ రెమిడీ. అంతేకాదు దంత సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది వేప, అయితే సౌందర్య పరంగా కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి. వేప మన చర్మానికి అప్లై చేయడం వల్ల సౌందర్యపరమైన ఉపయోగాలు పుష్కలంగా ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం.

వేప ఉండే ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కూడా మన చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఆరోగ్యకరంగా  మెరుస్తూ కనిపించేలా చేస్తుంది వేప. దీన్ని డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

యాక్నె..
వేపలో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియా గుణాల వల్ల ముఖంపై ఉన్న వాపును, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఏళ్లుగా ముఖంపై పేరుకున్న యాక్నేకు వేప ఎఫెక్టీవ్‌ రెమిడీ.

స్కిన్ ప్యూరిఫైయర్..
వేప ముఖానికి అప్లై చేయడం వల్ల ఇది న్యాచురల్ క్లెన్సర్‌ లా పనిచేస్తుంది. చర్మంపై ఉన్న వ్యర్ధాలను తొలగించి ముఖంపై అధికంగా పేరుకున్న నూనెను కూడా గ్రహిస్తుంది. వేప మన ముఖాన్ని ఆరోగ్యకరంగా కనిపించేలా చేస్తుంది. చర్మాన్ని శుద్ధ పరిచి కాంతివంతం చేస్తుంది.

యాంటీ ఏజింగ్..
వేపలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని సమతుల్యం చేస్తాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసే వేప వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలు, గీతలను తొలగిస్తుంది.

మృదువుగా..
వేపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ముఖాన్ని మృదువుగా మారుస్తాయి. చర్మానికి పోషణ అందిస్తుంది చర్మంపై ఎగ్జిమా సోరియాసిస్ రాకుండా కాపాడుతుంది.

ఈవెన్ స్కిన్ టోన్..
వేప ముఖానికి సమతుల్యమైన స్కిన్‌ టోన్ అందిస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలను తొలగించేసి హైపర్‌ పిగ్మెంటేషన్ సమస్యలు రాకుండా నివారిస్తూ ముఖానికి ఈవెన్ స్కిన్ టోన్ తో మెరిసేలా చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

Trending News