Skin Care Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ముఖంపై చర్మ సమస్యలు మటుమాయం.!

Natural Skin Care Tips At Home: ముఖంపై చర్మం బాగుంటేనే ఫేస్‌ అందగా కనిపిస్తుంది. అయితే చాలా మంది ముఖంపై చర్మం మెరిపించుకోవడానికి పలు ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ టిప్స్‌ను ఓ సారి ట్రై చేయండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 06:01 PM IST
 Skin Care Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ముఖంపై చర్మ సమస్యలు మటుమాయం.!

Natural Skin Care Tips At Home: మనలో చాలా మంది ముఖం ఎక్కువగా అందంగా కనిపించేందుకు చాలా రకాల సౌందర్య సాధానాలను వినియోగిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తున్న చాలా రకాల ప్రోడక్ట్స్‌ రసాయాలను  కలిగి ఉంటున్నాయి. వీటిని తరచుగా వినియోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందిలో ముఖంపై చర్మ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు, ఆధునిక జీవనశైలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది.

ఈ 3 పదార్థాలతో ముఖంపై మెరుపు రావడం ఖాయం:
1. పాలు:

పాలలో శరీరానికి కావాల్సి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పాలను తీసుకుంటూ ఉంటారు. అయితే పాలు శరీరానికే కాకుండా చర్మానికి కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ముఖంపై మెరుపు పెంచుకోవాలనుకునేవారు రోజుకు రెండుసార్లు ఒక గ్లాసు పాలను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

2. పెరుగు:
రైతా తినడానికి చాలా ఇష్టపడతారు.. అయితే ప్రతి రోజూ రైతాను తినడం వల్ల శరీరానికే కాకుండా ముఖానికి కూడా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ముఖంపై మచ్చలు, మొటిమలను శుభ్రం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

3. నిమ్మకాయ:
నిమ్మకాయను  సిట్రస్ పదార్ధంగా కూడా చెప్పుకుంటారు. అయితే దీని రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు ముఖంపై చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు  

Also Read: AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News