Mint Water Benefits: పరగడుపున ఈ పుదీనా నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Mint Water On An Empty Stomach: ప్రస్తుతం చాలా మంది తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ పుదీనా రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల  పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 23, 2023, 09:55 AM IST
Mint Water Benefits: పరగడుపున ఈ పుదీనా నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Mint Water On An Empty Stomach: పుదీనా వంటకాల రుచి పెంచడమేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే పుదీనాతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల  చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే మూలకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా వానా కాలంలో అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని కూడా రక్షిస్తాయి. అయితే ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పుదీనా డ్రింక్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
పుదీనా ఆకులు
బెల్లం పొడి
పచ్చి కొత్తిమీర ఆకులు
నల్ల ఉప్పు
జీలకర్ర పొడి
నిమ్మరసం

Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు

డ్రింక్‌ తయారీ విధానం:
పుదీనా డ్రింక్‌ తయారు చేయడానికి ముందుగా పుదీనా ఆకులను కట్‌ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆకులను బాగా శుభ్రం చేయాలి. ఇలా కడిగిన ఆకులను గ్రైడర్‌లో వేసి మొత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. అందులో కొత్తిమీర ఆకులను వేసి కూడా ఫైన్‌గా మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత బెల్లం పొడి, నిమ్మరసం మీ అవసరాన్ని బట్టి మిక్స్‌ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక గ్లాసులో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు తీసుకుని అందులోనే 2 టీస్పూన్ల పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలుపుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. 

పుదీనా వాటర్‌ ప్రయోజనాలు:
పొట్ట సమస్యలకు చెక్‌:

పుదీనా పొట్ట సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇవేకాకుండా తీవ్ర జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ముఖాన్ని తాజాగా ఉంచుతుంది:
చాలా మంది తరచుగా ముఖంపై మొటిమలు, మచ్చల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ పుదీనా నీరు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News