Mint Leaves Benefits In Summer Season: వేసవి కాలంలో పుదీనా ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని చల్లబరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే పుదీనా కొనడానికి బదులుగా ఇంట్లోనే తయారు మొక్కలుగా పెంచి ఆహారాల్లో వినియోగిస్తే మంచి లాభాలు పొందుతారు. ఎందుకంటే ఇంట్లో పెంచిన మొక్కల్లో ఎలాంటి రసాయనాలతో కూడిన కెమికల్స్ వినియోగించరు. కాబట్టి దీనిని ఆహార పదార్థాల్లో వినియోగించడం వల్ల మంచి లాభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జీర్ణక్రియలో సహాయపడుతుంది:
పుదీనా ఆకులను ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్ట ఉబ్బరం, వాంతులు, అజీర్ణం వంటి అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. దీంతో పాటు ఇందులో జీర్ణ ఎంజైమ్స్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబ్టటి ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశయం మెరుగుపడుతుంది. అలాగే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కూడా సులభంగా దూరమవుతాయి.
హైడ్రేషన్‌ను పెంచుతుంది:
ఎండా కాలంలో చాలా మందిలో హైడ్రేషన్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు మింట్‌తో తయారు చేసిన రిఫ్రెష్ డ్రింక్ తాగడం చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు పొట్టను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
ఒత్తిడిని నియంత్రిస్తుంది:
పుదీనా ఆకుల్లో కూడా గుణాలు మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. కాబట్టి దీనితో తయారు చేసిన టీని ప్రతి రోజు తాగడం వల్ల ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు మానసి ప్రశాంతతను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇంట్లో పుదీనాను ఎలా పెంచుకోవాలి:
ఇంట్లో పుదీనా చెట్లను పెంచడం చాలా సులభం. ఇలా ఇంట్లోనే పెంచిన మొక్కలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
మట్టిలో పుదీనాను పెంచే విధానం:
ముందుగా చిన్న మట్టి కుండీని తీసుకు అందులో ఎర్ర మట్టిని నింపాల్సి ఉంటుంది.
ఇందులోనే సేంద్రియ ఎరువులు వేసి బాగా కలపాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మార్కెట్‌లో కొనుగోలు చేసిన పుదీనా మొక్కలను తీసుకోవాల్సి ఉంటుంది.
వీటిని వేర్లు ఉన్న కాడలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.
ఇందులోనే కాడలను నాటుకుని, వాటిని బాల్కనీలో నేరుగా సూర్యకాంతి లేని, చీకటిగా లేని మూలలో ఉంచండి.
అంతే ఇలా నాటిన కొన్ని రోజులకు సులభంగా మొక్కలు పెరుగుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి