Mint Chutney For Acidity: ప్రస్తుతం భారత్‌లో చలికాలం ముగిసి ఎండా కాలం ప్రారంభమవుతుంది. చాలా మంది ఈ క్రమంలో తీసుకునే ఆహారాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. ముఖ్యంగా చట్నీ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే భారతీయులు వేసవి కాలం పుదీనా చట్నీ తినడం ఆనవాయితిగా వస్తోంది. పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని చట్నీ రూపంలో తినడం వల్ల శరీరానికి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండా కాలంలో పగటిపూట వేడిగా, రాత్రి చల్లగా అనిపిస్తుంది. కాబట్టి ఈ క్రమంలో పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ క్రమంలో పుదీనా చట్నీ తినడం శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా చట్నీ తయారు చేయడం చాలా సులభం.. దీనిని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇది శరీరానికి చాలా మంచిది కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పుదీనా చట్నీ చేయడానికి కావలసినవి
2 కప్పుల పుదీనా ఆకులు
1 కప్పు కొత్తిమీర ఆకులు
3/4 కప్పు ఉల్లిపాయ
1 టేబుల్ స్పూన్ పంచదార
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి
తగినంత ఉప్పు
పుదీనా చట్నీ చేసే విధానం:
పుదీనా చట్నీ చేయడానికి ముందుగా పుదీనా, కొత్తిమీర డ్రైడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నిమ్మకాయను పిండి, పైన ఉన్న పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి బాగా రుబ్బుకోవాలి. ఇలా చేసి మిశ్రమానికి తాలింపు పెట్టుకోవాలి. అంతే సులభంగా పుదీనా చట్నీ తయారవుతుంది. దీన్ని లంచ్ లేదా డిన్నర్ తో సర్వ్ చేయవచ్చు.
Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!
Also Read: Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook