Health Care tips: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో పుడ్ సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏదైనా వంటకం డిఫరెంట్ గా చేస్తే అది క్షణాల్లోనే నెట్టింట ట్రెండ్ అవుతోంది. మనం కూర తయారు చేయాలంటే నూనె వాడాల్సిందే. కొందరు టేస్ట్ కోసం నూనె, నెయ్యి రెండూ కలిపి వాడుతారు. ఈ మధ్య ఈ రెండింటితో తయారు చేసిన వంటకాలు చాలా మంది తింటున్నారు. అసలు నూనె, నెయ్యి కలిపి వంట చేయడం వల్ల లాభమా, నష్టమో తెలుసుకుందాం.
నూనె, నెయ్యి కలిపి వంట చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిని స్మోకింగ్ పాయింట్ దాటి వేడి చేస్తే.. వాటిలోని బాండ్స్ విచ్ఛిన్నమై..హానికరమైన కాంపోనెంట్స్ రిలీజ్ అవుతాయి. దీంతో చేసిన వంటకం తినడం వల్ల మీరు ఆనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
మన ఇళ్లలో వంట చేయడానికి నూనె వాడతాం. ఆయిల్స్ లో నువ్వుల నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె అని చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మరోవైపు నెయ్యిలో కూడా విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే నెయ్యి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంది. దీనిని మనం డైట్ లో చేర్చుకోవడం మంచిది. అయితే నెయ్యి, నూనెల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ.. రెండు కలిపి తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
Also Read: Benefits Of Green Tamato: పచ్చి టమాటా తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook