Beauty Tips: అప్పుడే ముడతలు వచ్చేస్తున్నాయా.. ఇలా చేస్తే నిత్య యవ్వనం మీ సొంతం..!

Beauty Tips: ఇంట్లో లభించే వస్తువుల ద్వారానే ముడతలు పోగొట్టుకోవచ్చని మీకు తెలుసా? మునగాకు ఫేస్ ప్యాక్ వల్ల చర్మం టైట్ గా మారుతుంది. స్కిన్ యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది... కొబ్బరి పాలు కూడా యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ముడతలకు చెక్ పెట్టవచ్చు. ఇక పెరుగు, తేనె, రోజ్ వాటర్ చర్మాన్ని మరింత స్మూత్ గా మార్చి.. డ్రై స్కిన్ సమస్యను దూరం చేస్తాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 4, 2024, 11:00 PM IST
Beauty Tips: అప్పుడే ముడతలు వచ్చేస్తున్నాయా.. ఇలా చేస్తే నిత్య యవ్వనం మీ సొంతం..!

Youthful Looks Tips: సరైన ఆహారం.. కంటి నిండా నిద్ర.. తగిన నీరు లేకపోతే చర్మం ముడతలు పడుతుంది అనడంలో సందేహం లేదు. సాధారణంగా వయసు పైబడిన తర్వాత వచ్చే ముడతలు ఇప్పుడు టీనేజ్ లో.. ఉన్నట్టుగానే కనిపించి.. ముసలి వారిలాగా కనిపిస్తూ ఉంటాము. ఇక ఆ ముడతలను పోగొట్టుకోవడానికి వేలకు వేలు ఖర్చు చేస్తూ.. పార్లర్ చుట్టూ తిరుగుతూ చివరికి స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాలను కూడా మనమే కొని తెచ్చుకుంటున్నాం. కాకపోతే గజిబిజి లైఫ్ స్టైల్ లో అందరికీ శరీరంపై దృష్టి పెట్టడానికి.. సమయం ఉండదు. అలాంటి వాళ్ళు వారంలో కేవలం ఒక్కరోజు మీ శరీరం కోసం.. ఆరోగ్యం కోసం.. చర్మం కోసం కాస్త సమయం కేటాయిస్తే.. ఇక పార్లర్ కు  వెళ్లి.. వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. మీరు నిత్య యవ్వనంగా కనిపించాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు వయసు పైబడినా సరే ఇంకా సంతూర్ మమ్మీ లాగే కనిపిస్తారనటంలో సందేహం లేదు. 

బ్యూటీ సీక్రెట్స్ దాచుకున్న మునగాకు..

అవును నిజమే.. మునగాకు మన ఆరోగ్యానికే కాదు.. చర్మ సంరక్షణకు కూడా ప్రథమ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ముడతలను పోగొట్టే సత్తా మునగాకు ఉంది.. ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నవయసులోనే ముడతల సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం లో మునగాకు తో ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా యవ్వనంగా కనిపిస్తారు.. మరి మునగాకు దాచుకున్న బ్యూటీ సీక్రెట్ ఏంటి..?దానిని ఎలా తయారు చేయాలి..?ఎప్పుడు ఏ విధంగా  ఉపయోగించాలి..? అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. 

మునగాకుతో ఫేస్ ప్యాక్ తయారీ..

ముందుగా ఒక బౌల్ తీసుకొని.. అందులో రెండు టేబుల్ స్పూన్ల మునగాకు పొడి వేసుకోవాలి. అలాగే మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు.. 1 టేబుల్ స్పూన్ పెరుగు,  1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్,  1 టేబుల్ స్పూన్ తేనె వేసి అన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీకు సమయం ఉన్నప్పుడు మెడకు, ముఖానికి అప్లై చేసి ..20 నిమిషాల పాటు ఆరబెట్టాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకుని.. మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా వారంలో ఒకసారి లేదా కుదిరితే వారానికి రెండు మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. 

ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగాలు..

ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మం టైట్ గా మారుతుంది. స్కిన్ యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది... కొబ్బరి పాలు కూడా యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ముడతలకు చెక్ పెట్టవచ్చు.. ఇక పెరుగు, తేనె, రోజ్ వాటర్ చర్మాన్ని మరింత స్మూత్ గా మార్చి.. డ్రై స్కిన్ సమస్యను దూరం చేస్తాయి. అలాగే ముఖం పైన జిడ్డు కారుతున్న వారు కూడా ఈ ప్యాక్ ఉపయోగించవచ్చు.

Also Read: YS Jagan Sharmila: ఒకే వేదికపై వైఎస్‌ జగన్, షర్మిల.. ఆరోజు ఏం జరగబోతున్నది?

Also Read: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News