How To Remove Split Ends: ముఖం అందంగా కనిపించేందుకు జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. శీతాకాలంలో వాతావరణంలోని తేమ పెరగడం వల్ల చాలామందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో చివర్ల చీలిక సమస్య మారి జుట్టు రాలిపోవడం ప్రారంభమవుతుంది. అయితే ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు తీవ్రంగా ఊడిపోయి అనేక రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. చాలామంది తరచుగా అలా తయారైన జుట్టును కత్తెరతో కత్తిరిస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చివర్ల చీలిక జుట్టు సమస్యలతో బాధపడేవారు ఇలా చేయండి?
జుట్టు చాలా పొడిగా, నిర్జీవంగా మారినప్పుడు చివర్ల చీలిపోయే సమస్యలు తప్పకుండా వస్తాయి అయితే ఈ క్రమంలో నిపుణులను సంప్రదించి పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
1. కెమికల్ బేస్డ్ షాంపూకి దూరంగా ఉండండి:
ప్రస్తుతం చాలామంది కెమికల్ బేస్డ్ హెయిర్ ప్రొడక్ట్స్ ను అతిగా వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి షాంపూలకు బదులు ఆయుర్వేద షాంపూలు వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.
2. జుట్టు చివర్ల హాట్ టవల్స్ వాడండి:
చాలామంది క్రమం తప్పకుండా హానికరమైన షాంపులతో తల స్నానం చేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఎలాంటి హాని లేకపోయినప్పటికీ శుభ్రం లేని టవల్స్ తో తుడుస్తారు. ఇలా చేయడం కూడా జుట్టుకు హానికరమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జట్టు చిట్లకుండా ఉండడానికి కొబ్బరి నూనెతో తేలికపాటి మసాజ్ చేసి తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జుట్టుకు టవల్ని చుట్టి ఆర పెట్టాల్సి ఉంటుంది.
3. బొప్పాయితో ఇలా చేయాలి:
బొప్పాయి పండు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించి పోషక విలువలను అందజేస్తుంది. అంతేకాకుండా ఇందులోని గుజ్జును జుట్టుకు అప్లై చేస్తే అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : RJ Surya and Aarohi : కష్టం, సుఖం పంచుకుంటాం.. సూర్యపై ఆరోహి కామెంట్స్.. బిగ్ బాస్ అనంతరం ఇలా
Also Read : Mahesh Babu Wife : నాలో వేడి పుట్టించండంటోన్న మహేష్ బాబు భార్య.. కొత్త లుక్కుతో షాకిచ్చిన నమ్రత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook