Dry Eyes Problem Solution: పొడి కళ్ల సమస్యలకు ఇలా 2 రోజుల్లో ఉపశమనం పొందవచ్చు!

Dry Eyes Problem Solution: పొడి కళ్ల సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తగిన పరిమానంలో నీటిని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా కళ్లలో రోజ్ వాటర్‌ను వేసుకోవాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2023, 11:51 AM IST
Dry Eyes Problem Solution: పొడి కళ్ల సమస్యలకు ఇలా 2 రోజుల్లో ఉపశమనం పొందవచ్చు!

How To Cure Dry Eyes Permanently: వాతావరణంలో మార్పుల కారణంగా శరీరంలో కూడా అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా వేసవి, చలికాలల్లో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా వాతావరణంలో కూడా తేమ పెరగడం కారణంగా కంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. అయితే పొడి గాలు వీయడం కారణంగా కళ్లలో మంటలు, దురద వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి కంటి సమస్యలనే పొడి కళ్ళు సమస్య అని అంటారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా రకాల ఇంటి చిట్కాలున్నాయి. అయితే ఎలాంటి చిట్కాలను వినియోగించడం వల్ల సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం..

పొడి కళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలి:
1. కళ్లను తాకవద్దు:
 కళ్లలో దురద లేదా మంట ఉంటే, చేతులతో కళ్లను తాకకుండా ఉండాల్సి ఉంటుంది. ఒక వేళా తాకితే కంటి ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి పొడి కళ్లు సమస్యలతో బాధపడేవారు వాటిని తాకకుండా ఉండడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

2. అతిగా నీటీని తాగాల్సి ఉంటుంది:
శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా కళ్లు పొడిబారతాయి. చలికాలంలో చాలా మంది నీటిని తాగడం మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సులభంగా పొడి కళ్ల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాల్సి ఉంటుంది.

3. హీటర్లకు దూరంగా ఉండండి:
చలికాలంలో చాలా మంది రూం హీటర్లను ఉపయోగిస్తారు. చలి నుంచి ఉపశమనం పొందడం మంచిదైనప్పటికీ, కానీ ఇలా చేయడం కళ్ళకు హానికరం. హీటర్లు ఎక్కువగా వాడటం వల్ల కళ్లు పొడిబారడం సమస్య రావచ్చు.

4. కళ్లలో రోజ్ వాటర్ వేయండి:
మీ కళ్లు మంటగా ఉంటే, రోజ్ వాటర్ లేదా ఐడ్రాప్స్ వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ కళ్లు శుభ్రమవుతాయి. అంతేకాకుండా దురద, ఇతక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి తప్పకుండా కళ్లలో రోజ్ వాటర్‌ వేసుకోవాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News