Anti Ageing Facepack: వయస్సు 40 ఏళ్లు దాటినా..యవ్వనంగా ఉంచే ఫేస్‌ప్యాక్ ఇదే

Anti Ageing Facepack: నిత్య యవ్వనంగా..అందంగా కన్పించేందుకు చాలామంది వివిధ రకాల క్రీమ్స్ అప్లై చేస్తుంటారు. అయితే ఏవి వాడాలో..ఏవి మానేయాలో పరిశీలించాల్సి ఉంటుంది. లేకుంటే అనర్ధాలే ఎక్కువ. 40 ఏళ్ల తరువాత కూడా నిత్య యవ్వనంగా, అందంగా కన్పించే ఫేస్‌ప్యాక్ గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2022, 11:04 AM IST
Anti Ageing Facepack: వయస్సు 40 ఏళ్లు దాటినా..యవ్వనంగా ఉంచే ఫేస్‌ప్యాక్ ఇదే

Anti Ageing Facepack: నిత్య యవ్వనంగా..అందంగా కన్పించేందుకు చాలామంది వివిధ రకాల క్రీమ్స్ అప్లై చేస్తుంటారు. అయితే ఏవి వాడాలో..ఏవి మానేయాలో పరిశీలించాల్సి ఉంటుంది. లేకుంటే అనర్ధాలే ఎక్కువ. 40 ఏళ్ల తరువాత కూడా నిత్య యవ్వనంగా, అందంగా కన్పించే ఫేస్‌ప్యాక్ గురించి తెలుసుకుందాం.

ఆధునిక జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపైనే కాకుండా ముఖ సౌందర్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంటుంది. అందుకే చాలామందిలో తక్కువ వయస్సులో చర్మం ముడతలు, అందం విహీనత తరచూ ఎదురయ్యే సమస్యలుగా ఉంటుంటాయి. అయితే ఇంట్లో లభించే వస్తువులతో తయారు చేసుకునే ఓ రకమైన ఫేస్‌ప్యాక్ నిత్య యవ్వనంగా ఉంచుతుంది. మీ వయస్సు 40 ఏళ్లు దాటినా అందంగా మారుస్తుంది. ఆ ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా రాసుకోవాలో చూద్దాం. ఇందులో వినియోగించే అరటిపండు, ఓట్స్ అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. చర్మంలోని డెడ్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. 

ఫేస్‌ప్యాక్ తయారీ విధానం

ముందుగా బాగా పండిన అరటిపండ్లను పేస్ట్‌గా చేసుకోవాలి. ఇందులో గుడ్డు తెల్లసొన, ఓట్స్, తేనె, రోజ్ వాటర్ కావల్సినంతగా కలుపుకోవాలి. మృదువుగా మారిన తరువాత ముఖానికి అప్లై చేయాలి. ముఖాన్ని బాగా కడిగిన తరువాత ఈ ప్యాక్ రాసుకోవాలి. వారానికోసారి రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుని..ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తే 2-3 నెలల్లోనే మొత్తం తేడా కన్పిస్తుంది. ఈ ఫేస్‌ప్యాక్‌‌లో పుష్కలంగా ఉండే విటమిన్ సి, ఇ, లు చర్మానికి ప్రొటెక్టివ్‌గా ఉంటాయి. అరటిపండు చర్మానికి పోషణ ఇస్తుంది. ఓట్స్ చర్మంలోని మలినాల్ని తొలగించి...స్కిన్ హోల్స్‌ను శుభ్రపరుస్తాయి. ఫలితంగా చర్మం సహజంగా మెరుస్తూ..యవ్వనంగా ఉంచుతుంది.

Also read: Blue Aadhaar Card: చిన్నారులకు ఆ ఆధార్ కార్డు తప్పనిసరా..ఎలా దరఖాస్తు చేసుకోవాలి

Trending News