How to identify adulterated dry fruits: హోలీ పండుగ రాబోతుంది. మార్కెట్లో రంగులకు, డ్రైప్రూట్స్ కు డిమాండ్ పెరుగుతుంది. ఈనేపథ్యంలో అంగడిలోకి కల్తీ లేదా నకిలీ డ్రై ప్రూట్స్ వచ్చేస్తున్నాయి. వీటి నాణ్యతను కనిపెట్టడానికి మీకు ఈరోజు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాం.
కల్తీ జీడిపప్పును గుర్తించడమెలా..
మీరు హోలీ రోజున జీడిపప్పు కొని ఇంటికి తెస్తున్నారంటే జాగ్రత్తగా ఉండండి. జీడిపప్పులో పసుపు కనిపించినా లేదా నూనె వాసన వచ్చినా అది చెడిపోయిందని అర్థం చేసుకోండి. లేత గోధుమరంగు మరియు తెలుపు రంగు జీడిపప్పులు పూర్తిగా స్వచ్ఛమైనవి.
నకిలీ అత్తి పండ్లు, పిస్తాలను తెలుసుకోవడమెలా..
మీరు పిస్తాపప్పులు మరియు అత్తి పండ్ల (అంజీరా) యొక్క స్వచ్ఛతను కూడా అదే విధంగా తనిఖీ చేయవచ్చు. దీని కోసం మీరు వాటిని నమిలి చూడండి. నమలడం కష్టంగా అనిపిస్తే.., అది చెడిపోయినట్లు అర్థం చేసుకోండి. స్వచ్ఛమైన అత్తి పండ్ల మరియు పిస్తాలు తినడానికి మెత్తగా ఉంటాయి.
డూప్లికేట్ ఎండుద్రాక్షను కనిపెట్టడం ఎలా..
ప్రస్తుతం మార్కెట్‌లో నకిలీ ఎండు ద్రాక్షను కూడా విక్రయిస్తున్నారు. దీన్ని కనిపెట్టడానికి మీరు ఎండుద్రాక్షను చేతితో రుద్దండి. అలా చేసినప్పుడు పసుపు రంగు రావడం ప్రారంభిస్తే అది కల్తీదని అర్థం చేసుకోండి. ఈ రకమైన ఎండుద్రాక్షలు సల్ఫర్ వాసనతో ఉంటాయి.
బాదంపప్పును ఇలా చెక్ చేసుకోండి
పండుగ వచ్చిందంటే చాలా మంది బాదంపప్పును కొంటారు. ఇది హెల్త్ కు చాలా మంచిది. బాదంపప్పును మీ చేతితో రుద్దినప్పుడు కుంకుమపువ్వు రంగు వస్తే అది కల్తీదని తెలుసుకోండి. అలాంటి వాటిని తినకూడదు.
Also Read: Signs of Death: మరణించేముందు శరీరం ఏ సంకేతాలను పంపిస్తుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook