High In Protein Veg Food: ప్రస్తుతం చాలా మంది ప్రొటీన్‌లో సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యల కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రొటీన్ లోపం సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇది పరిమాణంలో లభించే ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాంసాహారులైతే గుడ్లు, మాంసాలను తీసుకుంటారు. ఇక శాఖాహారుల పరిస్థితి విషయానికొస్తే ఈ కింద పేర్కొన్న ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాలి.
వీటిలో అధిక పరిమాణంలో ప్రొటీన్లు లభిస్తాయి:
పచ్చి బఠానీలు:
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాల్లో పచ్చి బఠానీలు కూడా ఒకటి. ఇందులో కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించే గుణాలు లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా పచ్చి బఠానీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి తీవ్ర వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
కాలీఫ్లవర్:
కాలీఫ్లవర్‌లో హై ప్రోటీన్ ఉంటుంది. ఇందులో మాంసాల్లో కంటే ఎక్కువ పరిమాణంలో ప్రొటీన్ లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో కేలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాలీఫ్లవర్‌లో క్యాలీఫ్లవర్‌లో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ కూడా ఉంటాయి. కాబట్టి సులభంగా క్యాన్సర్ వ్టి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
పాలకూర:
పాలకూరలో కూడా అధిక పరిమాణంలో ప్రొటీన్లు లభిస్తాయి. దీంతో పాటు బచ్చలికూరను తీసుకోవడం వల్ల శరీరానికి అమినో యాసిడ్‌లు లభించి తీవ్ర వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు కూడా దూరమవుతాయి.
మొలకలు:
మొలకల్లో ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచి ఫలితాలు కలుగుతాయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మొలకలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. మొలకల్లో ప్రొటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook