Health Tips: మీ డైట్‌లో ఈ పదార్ధాలుంటే చాలు వృద్ధాప్య లక్షణాలకు చెక్

Health Tips: మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో విటమిన్లు, మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అంతర్గత ఆరోగ్యమే కాదు.. సౌందర్య పరిరక్షణ కూడా కొన్ని రకాల విటమిన్లతో జరుగుతుంది. ఈ విటమిన్ల లోపముంటే చర్మ సమస్యలు వంటివి ఎదురౌతాయి. పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 11, 2023, 02:06 AM IST
Health Tips: మీ డైట్‌లో ఈ పదార్ధాలుంటే చాలు వృద్ధాప్య లక్షణాలకు చెక్

Health Tips: ఆదునిక జీవన విధానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటాయి. అదే కొందరిలో వయస్సు పెరిగినా సరే నిత్య యౌవనంగా కన్పిస్తుంటారు. కారణం విటమిన్ల ప్రభావమే. సరైన మోతాదులో తగిన విటమిన్లు ఉంటే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషక పదార్ధాలు, విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. బాహ్య సౌందర్యాన్ని పరిక్షించడంలో విటమిన్ ఇ కీలక భూమిక పోషిస్తుంది. మీ శరీరంలో వయస్సుతో వచ్చే లక్షణాల్ని అంత త్వరగా రానివ్వకుండా చేస్తుంది విటమిన్ ఇ. విటమిన్ ఇ కోసం మార్కెట్‌లో లభించే వివిధ రకాల మందులు వాడాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో విరివిగా లభించే వివిధ రకాల ఆహార పదార్ధాల్లో ఆరోగ్యానికి అవసరమైన పోషక పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందులో ముఖ్యమైంది విటమిన్ ఇ. ఎందుకంటే విటమిన్ ఇ అనేది కంటికి, చర్మ సంరక్షణకు అన్నింటికీ మంచిది. విటమిన్ ఇ ఎందులో పుష్కలంగా లభిస్తుందనే తెలుసుకుందాం..

విటమిన్ ఇ అనేది కేవలం బాహ్య సౌందర్యానికే కాదు అంతర్గత ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తకుండా ఉండాలంటే విటమిన్ ఇ తప్పనిసరి. అదే విధంగా కంటి చూపు పరిరక్షించడంలో కూడా విటమిన్ ఇ చాలా అవసరం. విటమిన్ ఇ లోపముంటే అటు చర్మ సమస్యలు, ఇటు కంటి చూపు మందగించడం తలెత్తవచ్చు. విటమిన్ ఇ తగిన మోతాదులో ఉంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. అదే విధంగా ఎండలో తిరిగేటప్పుడు యూవీ కిరణాల్నించి చర్మాన్ని పరిరక్షించేది ఇదే. 

విటమిన్ ఇ అనేది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగపడుతుంది. ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలక భూమిక పోషిస్తాయి. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ నాశనమౌతాయో..వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. నిత్య యవ్వనంగా కన్పిస్తారు. అందుకే చాలావరకూ బ్యూటీ కేర్ ఉత్పత్తుల్లో విటమిన్ ఇ తప్పకుండా ఉంటుంది. విటమిన్ ఇని ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంటారు. 

విటమిన్ ఇ ప్రకృతిలో లభించే చాలా రకాల పదార్ధాల్లో పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లో కావల్సనంత లభిస్తుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవల్సింది బాదం. ఇందులో అనేక పోషకాలుంటాయి. ఇందులో అధిక స్థాయిలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని రక్షిస్తుంది. అన్ని రకాల యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో ఉంటాయి. దీంతోపాటు బాదంలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే మరో డ్రై ఫ్రూట్ హాజెల్ నట్స్. ఇందులో కూడా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కణాలు దెబ్బతినకుండా కచ్చితమైన రక్షణ కల్పిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. హాజెల్ నట్స్‌లో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. మరో డ్రై ఫ్రూట్ అవకాడో. ఇందులో విటమిన్ ఇతో పాటు ఇతర విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ కావల్సినంతగా లభిస్తుంది.

డ్రై ఫ్రూట్స్ కాకుండా వంట నూనెల్లో కూడా విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా సన్ ఫ్లవర్ ఆయిల్‌తో పాటు బియ్యం ఊక, గోధుమలు, ఆలివ్ ఆయిల్, సోయా బీన్, మొక్క జొన్న నూనెల్లో విటమిన్ ఇ ఉంటుంది. విటమిన్ ఇ శరీరానికి రోజుకు కావల్సినంత పరిమాణంలో ఉండేట్టు మీ డైట్ మార్చుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. శరీరంపై వృద్ధాప్య ఛాయలు కన్పించవు. అదే సమయంలో అంతర్గత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

Also read: Ghee Benefits: నెయ్యి ఎవరికి మంచిది కాదు, ఏ సమస్య ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News