Hair Problem Solution: తెల్ల జుట్టు ఎందుకు వస్తుందో తెలుసా.. రాకుండా ఇలా చేయండి..!

Hair Problem Solution: ప్రస్తుత చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా ప్రోడక్ట్‌ ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 11:52 AM IST
  • ఎందుకు తెల్ల జుట్టు వస్తుందో తెలుసా..
  • ఆధునిక జీవన శైలి, ఆహారంపై శ్రద్ధ వహించక పోవడం వల్లే..
  • ఆమ్లా, మెహందీ వినియోగించి విముక్తి పొందండి
Hair Problem Solution: తెల్ల జుట్టు ఎందుకు వస్తుందో తెలుసా.. రాకుండా ఇలా చేయండి..!

Hair Problem Solution: ప్రస్తుత చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా ప్రోడక్ట్‌ ఉన్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. అంతేకాకుండా చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్న వారు కెమికల్ బేస్డ్ హెయిర్ డై(Chemical based hair dye)లను వాడుతున్నారు. అయితే ఇందులో ఉండే గుణాలు జుట్టు పొడిబారడానికి కారణమవుతుంది. అంతేకాకుండా కొందరిలో తెల్లజుట్టు రావడానికి దారి తీస్తుంది. ఈ సమస్యలతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే జుట్టును మళ్లీ నల్లగా మాడాని సహాజసిద్ధమైన పద్ధతులను వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా.. కుదుల్ల నుంచి బలంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఇంటి నివారణలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకు తెల్ల జుట్టు వస్తుంది..?:

జుట్టు తెల్లగా మారడానికి ప్రధాన కారణం జన్యుపరమైన కారణాలు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కావున ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది. అంతేకాకుండా స్ట్రీట్‌ ఫుడ్‌ తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

తెల్ల జుట్టును సహజంగా ఇలా సులభంగా నల్లగా మార్చకోండి:

1. కరివేపాకు(curry leaves):

ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపాను వినియోగిస్తారు. ఇది ఆహార  రుచిని  పెంచడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.  అంతేకాకుండా వెంట్రుకలను నల్లగా మార్చేందుకు సహాయపడుతుంది. అయితే ఈ కరివేపాకును జుట్టును నల్లగా మార్చేందుకు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇందులో ఉండే బీటా, కెరోటిన్, ప్రొటీన్లు జుట్టును నల్లగా చేసేందుకు సహాయపడుతుంది. దీని కోసం ఆకులను పేస్టులా చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.. ఆరిపోయే దాకా ఉంచి శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు సమస్యలన్ని మాయమవుతాయి.

2. ఆమ్లా, మెహందీ(Amla, mehndi)

ఉసిరికాయలో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. అయితే దీనిని క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరం అన్ని సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు.  జుట్టు సమస్యలు పోవడానికి ప్రతిరోజూ ఒక గ్లాసు ఉసిరి రసం తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఇలా చేయడం వల్ల జుట్టు సహజంగా కుదుల్ల నుంచి నల్లగా మారుతుంని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర రోగనిరోధక శక్తి ని పెంచుతుంది.

3. సిట్రస్ పండ్లు(Citrus fruits)

నిమ్మ, నారింజ, ద్రాక్షపండు వంటి పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జుట్టు నెరసిపోవడం, బలహీనపడం వంటి సమస్యలు దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటి వల్ల చాలా తొందరలోనే జుట్టు పెరగడంపై ప్రభావం చూడవచ్చు.
 
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Kadem project floods live updates: అన్ని గేట్లు ఎత్తేశాం.. కడెం ప్రాజెక్టుపై చేతులెత్తేసిన ఇరిగేషన్ అధికారులు

Also Read: Horoscope Today July 14th: నేటి రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలుగుతుంది..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News