/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Hair Growth Tips: జుట్టు అందంగా, ఆరోగ్యంగా, దృఢంగా, ఉంటేనే ముఖం కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహార పలవాట్లు కారణంగా చాలామందిలో చిన్న వయసులోనే జుట్టు రాలడం చుండ్రు తెల్ల జుట్టు జుట్టు పెరుగుదలలో సమస్యలు వస్తున్నాయి ఇలా జుట్టు సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ సమస్యలతో బాధపడేవారు ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఎన్నో రకాల ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జీవనశైలిలో కొన్ని మార్పులు, ఆహారాల తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ పాటిస్తే సులభంగా చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు.

జుట్టు సమస్యల నుంచి సహజ సిద్ధంగా ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే వివిధ రసాయనాలతో కూడిన ప్రోడక్ట్లను వినియోగించడం మానుకోవాలి. దీంతోపాటు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా జుట్టు అందాన్ని పెంచేందుకు ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి దీనిని జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా మారుతుంది. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

దీంతోపాటు భృంగ‌రాజ్ కూడా జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని నివారించి తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది అంతేకాకుండా జుట్టును వేగంగా ఒత్తుగా పెంచేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఈ భృంగ‌రాజ్ ను వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మెంతి గింజలు కూడా ఎంతగానో సహాయపడతాయి.  దీనితో తయారు చేసిన మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టులో చుండ్రు, తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి.

అలాగే మెంతి గింజల్లో ఉండే కొన్ని ఔషధ గుణాలు జుట్టును ఒత్తుగా చేసేందుకు కూడా సహాయపడతాయి.  కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు మెంతి గింజలతో తయారు చేసిన మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. లో ఉండే గుణాలు పొడిబారడాన్ని కూడా నియంత్రిస్తుంది అంతేకాకుండా జుట్టులో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ప్రస్తుతం చాలామందిలో జుట్టులో దురద, దద్దుర్లు కూడా వస్తున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ మెంతి గింజల మిశ్రమం ప్రభావవంతంగా సహాయపడుతుంది. 

Also read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Hair Growth Tips: Rid Dandruff, White Hair, Hair Fall Problems With Fenugreek Seeds And Bhringraj Mixture Dh
News Source: 
Home Title: 

Hair Growth Tips: జుట్టు సమస్య ఏదైనా వన్ స్టాప్ సొల్యూషన్..ఈ చిట్కాలతో ఒత్తయిన మందమైన జుట్టు మీ సొంతం..

Hair Growth Tips: జుట్టు సమస్య ఏదైనా వన్ స్టాప్ సొల్యూషన్..ఈ చిట్కాలతో ఒత్తయిన మందమైన జుట్టు మీ సొంతం..
Caption: 
source file : zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
జుట్టు సమస్య ఏదైనా వన్ స్టాప్ సొల్యూషన్..ఈ చిట్కాలతో ఒత్తయిన మందమైన జుట్టు మీ సొంతం!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, December 26, 2023 - 21:57
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
40
Is Breaking News: 
No
Word Count: 
322