Guava Side Effects: జామపండ్లను అతిగా తింటే అంతే సంగతి.. ఈ వ్యాధులున్నవారు అస్సలు తినొద్దు..

Guava Side Effects: జామపండ్లను ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగొచ్చు. అయితే ఈ కింది సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2023, 08:52 AM IST
Guava Side Effects: జామపండ్లను అతిగా తింటే అంతే సంగతి.. ఈ వ్యాధులున్నవారు అస్సలు తినొద్దు..

Guava Side Effects: జామపండు అన్ని కాలాల్లో లభించే ఉత్తమమైన పండు. ఎంతో రూచిగా, ఇష్టంగా ప్రతి ఒక్కరు తినే పండు.  ఇది ప్రతి ఇంటి పెరటిలో సులభంగా పెరిగే చెట్టు. అయితే జామ పండులో ఎన్నో విలువైన పోషకాలు దాగి వున్నాయి. ఇందులో విటిమిన్‌ సి, పొటాషియాం, ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండులో వుండే విటిమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జామపండ్లు ఎక్కువగా ఆసియా దేశాలలో పండుతాయి. ఆకుకూరలలో లభించే ఫైబర్‌ కంటే.. జామపండులో ఎక్కువ రేట్ల ఫైబర్‌ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణవ్యవస్థను మెరుగు పరచడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఇన్ని పోషకాలువున్న జామపండు అందరికీ ఉపయోగపడదు. ఏ వ్యక్తులు జామపండు తినకుండా ఉండాలో తెలుసుకుందాం..

ఈ సమస్యలున్నవారు తినొచ్చా?:
గ్యాస్ సమస్య:

పొట్ట సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా కడుపు ఉబ్బరం,  గ్యాస్ సమస్యలతో బాధపడేవారు జామపండును తినకుండా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జామలో 40 శాతం ఫ్రక్టోజ్ ఉంటుంది. కాబట్టి సమస్యలను రెట్టింపు చేసే అవకాశాలున్నాయి.

మలబద్ధకం:
ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం సమస్యలతో  బాధపడుతున్నారు. అయితే జామలో పుష్కలంగా ఫైబర్‌ లభిస్తుంది. దీనిని ప్రతి రోజూ తినడం వల్ల జీర్ణ సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి వాటిని అతిగా తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్‌:
డయాబెటిస్‌ సమస్యలతో బాధపడుతున్నవారు కూడా జామ పండ్లను అస్సలు తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా పెంచుతుంది. దీంతో దీర్ఘకాలీక సమస్యలకు కూడా దారీ తియోచ్చు.

జలుబు, దగ్గు:
శీతకాలంలో జామ పండ్లను అతిగా తినడం వల్ల జలుబు, దగ్గు సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శీతకాలంలో వీటిని అతిగా తినడం వల్ల  జలుబు, దగ్గు సమస్యలు పెరుగుతాయి. కాబట్టి శీతాకాలంలో వీటిని తినకపోవడం చాలా మంచిది.

Also Read: Mla Kotamreddy Sridhar Reddy: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు.. ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఫైర్   

Also Read: India Post Office Recruitment 2023: పోస్టల్ శాఖలో 40 వేల ఉద్యోగాలు.. టెన్త్ అర్హత.. డైరెక్ట్ జాబ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News