Guava Benefits: జామ పండు చలికాలంలో తింటే ఈ బంఫర్‌ బెనిఫిట్స్‌ మీ సొంతం!

Guava Fruit Benefits: జామ పండులో ఉండే వివిధ రకాల పోషకాలు ఉంటాయి. రోజు ఉదయం పూట దీనిని తినడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 5, 2024, 01:38 PM IST
Guava Benefits: జామ పండు చలికాలంలో తింటే ఈ బంఫర్‌ బెనిఫిట్స్‌ మీ సొంతం!

Guava Fruit Benefits In Telugu: జామ పండును వైద్య నిపుణులు పోషకాల గనిగా పిలుస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాపిల్‌లో ఎన్ని రకాల పోషకాలు లభిస్తాయో.. జామలో కూడా అనేక రకాల విటమిన్స్‌ లభిస్తాయి. దీంతో పాటు విటమిన్ సి, ఫైబర్, పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు అల్పాహారంలో తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే వివిధ రకాల మూలకాలు అందుబాటులో ఉంటాయి. అయితే దీనిని రోజు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.  

జామ పండు తినడం వల్ల కలిగే లాభాలు:
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: 

జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.  అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా కల్పిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

జీర్ణ వ్యవస్థకు మేలు: 
జామలోని ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా సులభంగా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జామకాయను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 

గుండె సమస్యలకు చెక్‌: 
జామకాయలో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది రక్తపోటును సులభంగా నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సులభంగా తగ్గిస్తుంది. దీని కారణంగా గుండె జబ్బులు కూడా రాకుండా  ఉంటాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: 
జామలో కేలరీలు తక్కువగా మోతాదులో ఉంటాయి. ఇందులో లభించే ఫైబర్ శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

చర్మ సమస్యలకు చెక్‌: 
జామకాయాల్లో యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షించేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ముడతలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News