మాతృప్రేమ: మనవరాలికి జన్మనిచ్చిన అమ్మమ్మ.. అసలేం జరిగిందో తెలుసా?

Brazil: తన కూతురు పిల్లలను కనలేదని తెలిసి ఆమె కోసం మరోసారి తల్లిగా మారింది ఓ పెద్దావిడ. అంటే తన కడుపులో మనవరాలికి జన్మనిచ్చిందన్న మాట. ఈ ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2021, 02:28 PM IST
మాతృప్రేమ: మనవరాలికి జన్మనిచ్చిన అమ్మమ్మ.. అసలేం జరిగిందో తెలుసా?

Birth to own Granddaughter: 53 ఏళ్ల వయసులో ఓ మహిళ తన మనవరాలికి జన్మనిచ్చింది. అదేంటి మనవరాలికి(Granddaughter) జన్మనివ్వడం ఏమిటని అనుకుంటున్నారు. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.  

దేవుడు ప్రతి చోట ఉండలేక.. తల్లిని సృష్టించాడని అంటారు. అందుకే తల్లిని దైవంతో పోల్చుతారు. చాలా సార్లు పిల్లల కోసం తల్లులు చేసిన త్యాగాలకు సంబంధించిన కథనాలు వింటూనే ఉంటాం. అలాంటి చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సందర్బాలు ఉన్నాయి. తాజాగా ఓ మహిళ తన కూతురు పిల్లలు కనలేదని నిర్ధారణ కావడంతో..తమ వారసులను తనే కనాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం ఆమె చాలా రిస్క్ చేసిందనే చెప్పాలి. చివరకు ఆమె తన మనవరాలికి జన్మనిచ్చింది. 

Also Read: Deer Tested Corona positive: ప్రపంచంలో తొలిసారిగా జింకకు కరోనా వైరస్

వివరాల్లోకి వెళితే..
బ్రెజిల్(Brazil) దక్షిణ భాగంలోని సెయింట్ కాటరినా నగరంలో ఉన్న టీచర్ రోసిక్లియా డి అబ్రూ కార్సెమ్(Rosicleia de Abreu Carlsem) అనే మహిళకు ఓ 29 ఏళ్ల కూతరు ఇంగ్రిడ్ ఉంది. కూతురికి 2014 నుంచి పల్మనరీ ఎంబోలిజం(pulmonary embolism) వ్యాధి ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు.. బిడ్డకు జన్మనివ్వడం అనేది వారి ప్రాణాలకే ముప్పు అని వైద్యులు తెలిపారు. ఎందుకంటే శరీరంలో రక్తం గడ్డకట్టడం ద్వారా వారు చనిపోతారని చెప్పారు. అందుకే ఇంగ్రిడ్‌ను గర్భదారణకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు.

ఇక, రోసిక్లియా కూతురుకు ఇంగ్రిడ్‌కు ఫాబియానా అనే వ్యక్తితో పెళ్లైంది. కానీ ఇంగ్రిడ్‌కు పిల్లలు కనే భాగ్యం లేకుండా పోయింది. అయితే ఓ రోజు టీవీలో ఓ మహిళ తన కోడలు.. బిడ్డకు జన్మనిచ్చిందనే వార్తను చూసిన రోసిక్లియా కూతురు ఇంగ్రిడ్.. వెంటనే తన తల్లికి వద్దకు చేరుకుంది. ఆమె ఈ విషయం చెప్పింది. తన బిడ్డకు జన్మనివ్వమని అడిగింది. అందుకు రోసిక్లియా కూడా సంతోషంగా ఒకే చెప్పింది. దీంతో IVF ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు అంతా సిద్దం అయింది. ఇందుకు ఆ కుటుంబం క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించారు. అంతేకాకుండా.. ఫేస్ మాస్క్‌(Face Masks)లు అమ్మడం ద్వారా డబ్బులు జమచేశారు. ఇక, ఆగస్టు 19న రోసిక్లియా తన మనవరాలుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్పారు. 

రోసిక్లియా మాట్లాడుతూ.. ‘నేను నా కూతరును చాలా ప్రేమిస్తాను. అందుకే ఆమె కోసం ఈ పని చేశాను. నా కూతురికి, మనవరాలి(Grand Daughter)కి జన్మనివ్వడం నా అదృష్టం’అని తెలిపారు. తన కోసం తన తల్లి చేసిన త్యాగం మాటల్లో చెప్పలేనిదని ఇంగ్రిడ్ పేర్కొంది. ప్రపంచంలో ఉన్న గొప్ప తల్లులలో తన తల్లి కూడా ఒక్కరని చెప్పింది. మరోవైపు ఈ క్షణాలు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పింది. ఇంగ్రిడ్ భర్త కూడా తండ్రి కావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News