Glowing Skin: టమాటో ఐస్ క్యూబ్స్‌తో కేవలం 15 నిమిషాల్లో ఫెయిర్‌ స్కిన్‌ పొందడం ఖాయం!

How To Get Glowing Skin: ఫెయిర్‌ స్కిన్‌ పొందడానికి చాలా మంది వివిధ రకాల రసాయనాలతో కూడిన స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటికి బదులుగా టమాటో ఐస్ క్యూబ్స్ వినియోగించడం వల్ల నాచురల్‌గా మంచి ఫలితాల పొందుతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 03:54 PM IST
Glowing Skin: టమాటో ఐస్ క్యూబ్స్‌తో కేవలం 15 నిమిషాల్లో ఫెయిర్‌ స్కిన్‌ పొందడం ఖాయం!

 

How To Get Glowing Skin: నిరంతరం సూర్యరశ్మి చర్మంపై పడడం వల్ల చర్మం డల్‌గా మారుతుంది. బ్రైట్‌నెస్‌ తగ్గిపోయి..అనేక రకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రోజు బయట తిరిగే మహిళల్లో డల్‌నెస్‌, టానింగ్‌  వంటి చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది అనే రకాల స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతారు. వీటికి బదులుగా ఎలాంటి ఖర్చు లేకుండా టొమాటో ఐస్ క్యూబ్స్‌ను వాడడం వల్ల ఫెయిర్‌ స్కిన్‌ పొందడమే కాకుండా చర్మ సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి. అయితే ఈ ఐస్‌ క్యూబ్స్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

టమాటో ఐస్ క్యూబ్స్ చేయడానికి కావలసిన పదార్థాలు:
2 టమాటోలు 
1 చెంచా తేనె 
తగినంత నీరు

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

టమాటో ఐస్ క్యూబ్స్ తయారీ విధానం:
ఈ ఐస్ క్యూబ్స్‌ను తయారు చేయడానికి ముందుగా 2 పండిన టమాటోలను తీసుకోవాల్సి ఉంటుంది. 
వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.
అంతేకాకుండా ఇదే గిన్నెలో 1 స్పూన్ తేనె కలపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఐస్‌ అచ్చుల్లో వేసి 2 నుంచి 3 గంటలు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయాల్సి ఉంటుంది.
ఇలా చేస్తే టమాటో ఐస్ క్యూబ్స్ తయారైనట్లే..

టమాటో ఐస్ క్యూబ్స్ అప్లై చేసుకునే విధానం:
టమాటో ఐస్ క్యూబ్స్ అప్లై చేయడానికి ముందుగా ముఖాన్ని శుభ్రమైన నీటితో బాగా కడగాల్సి ఉంటుంది.
ఆ తర్వాత తయారు చేసి పెట్టుకున్న క్యూబ్‌ను ముఖానికి అప్లై చేయాలి. 
ఇలా సుమారు 10 నిమిషాల పాటు అప్లై చేసుకున్న తర్వాత బాగా మసాజ్‌ చేయాల్సి ఉంటుంది. 
ఇలా క్యూబ్స్‌ను వారానికి 1 నుంచి 2 సార్లు అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News