Foods Rich In Vitamin B12: శరీరంలో విటమిన్ల లోపం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. కాబట్టి శరీరానికి అన్ని రకాల విటమిన్స్ కావాల్సి ఉంటుంది. శరీరానికి అన్ని రకాల పోషకాలు ఎలా అవసరమవుతాయో వాటి కంటే ఎక్కువగా విటమిన్ B12 శరీరానికి అవసరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా డీఎన్‌ఏ తయారీకి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శరీరం విటమిన్ B12 ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా లభిస్తుంది. అయితే చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ B12 సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి రోజు విటమిన్ B12 అధిక పరిమాణంలో లభించే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
రోజుకు విటమిన్ B12 ఎంత అవసరమో తెలుసా?:
ప్రతి రోజు శరీరానికి తగిన పరిమాణంలో విటమిన్ బి12 అవసరమతుంది. పెద్దవారికి ప్రతి రోజు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరమవుతాయి. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలకు వీటికంటే ఎక్కువ విటమిన్ బి12 అవసరమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
విటమిన్ బి 12 లోపం వల్ల కలిగే దుష్ర్పభాలు:
శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉంటే రక్తం పరిమాణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా మందిలో ఆకలి తగ్గిపోతుంది. చేతులు, కాళ్లలో తిమ్మిరి వంటి లక్షణాలు వస్తాయి.
ఈ ఆహారాలు తినండి:
- మాంసం
- చేపలు
- పాల ఉత్పత్తులు
- గుడ్లు
- పప్పులు
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి