Ayurvedic Powder For Health Diseases: ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందులో ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాల మందులు, చికిత్సలు తీసుకుంటారు. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండదు. అయితే ఈ చిన్న పొడిని మీరు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఈ పొడిని ప్రతిరోజు అర స్పూన్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
ఈ ఆరోగ్యకరమైన పొడిని ఎలా తయారు చేసుకోవాలి దీని వల్ల కలిగే లాభాలు:
ఈ పొడి కోసం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులోకి కొన్ని మెంతులు వేసుకోని వేయించుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లో అర కప్పు వాము, నల్ల జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. కొంతసేపు వీటిని చల్లరించుకోవాలి. ఆ తరువాత మిక్సీ జార్‌లో తీసుకోని అందులోకి పైన చెప్పిన పదార్థాలను వేసుకోవాలి. ఈ పొడిని ఒక టైట్ జార్‌లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
ఈ పొడిని రోజు నైట్ డిన్నర్ పూర్తి చేసిన తరువాత గోరువెచ్చని నీటిలో తీసుకొని అర స్పూన్ కలుపుకొని తీసుకోవాలి. ఆ తరువాత ఏటు వంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఆ తరువాత మెంతులు, వాము, నల్ల జీలకర్ర కలిపి తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు తొలిగిపోతాయి. అలాగే జీర్ణవ్యవస్థత మెరుగుపడుతుంది.
ఈ పొడిని డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు రాత్రి పడుకొనేముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గుండె జబ్బులు ఉన్నవారు దీని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. అంతేకాకుండా ఊబకాయం, క్యాన్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పొడిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ పొడి హార్మోన్‌ల హెచ్చుతగ్గులను తగ్గిస్తుంది. తరుచు జలబ్బు, దగ్గు, జర్వం బారి పడుతున్నవారు ఈ పొడిని ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి