Eating Habits: ఒంటరిగా తినవద్దు, కలిసి తింటే కలదు సుఖం, ఒత్తిడి-ఆందోళనకు కారణమదే

Eating Habits: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి-ఆందోళన ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. సులభమైన టిప్స్ పాటిస్తే కచ్చితంగా ఒత్తిడిని జయించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 12, 2022, 09:49 PM IST
Eating Habits: ఒంటరిగా తినవద్దు, కలిసి తింటే కలదు సుఖం, ఒత్తిడి-ఆందోళనకు  కారణమదే

Eating Habits: ఉరుకులు, పరుగుల జీవితంలో వివిధ రకాల అలవాట్లు, జీవనశైలి కారణంగా ఆరోగ్యంపై ప్రభావం చూపించడమే కాదు..మానసికంగా కూడా బలహీనపడుతున్నాం. ఆర్ధికంగా బాగున్నా..ఏదో తెలియని వ్యాకులత, ఒత్తిడి, ఆందోళన పీడిస్తుంటుంది. ఇవి ఆరోగ్యానికి మరీ ప్రమాదకరం. అయితే కొన్ని సులభమైన టిప్స్ పాటించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన నుంచి దూరం కావచ్చు.

భోజనం చేసే విధానం

ఇంట్లో అందరూ ఉన్నా కొందరు ఒంటరిగా తింటుంటారు. మరి కొందరు కలిసి భోజనం చేస్తుంటారు. ఈ రెండింటి ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. ఒంటరిగా తినే అలవాటు మంచిది కాదని..ఓ అధ్యయనంలో వెలుగుచూసింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జరిపిన అధ్యయనంలో దాదాపు 1000 మందిని భోజనం తినే విషయమై కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు ఏం సమాధానాలు లభించాయి, భోజనం చేసే విధానంతో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఆ అధ్యయనం ద్వారా తెలుసుకుందాం..

నిపుణులు ఏం చెబుతున్నారు

ఒంటరిగా తినడం, కుటుంబ సభ్యులతో కలిసి లేదా స్నేహితులతో కలిసి తినడంపై జరిపిన అధ్యయనంపై జాన్ హాప్‌కిన్స్‌కు చెందిన డాక్టర్ ఎరిన్ డోనెల్లీ మైకోస్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒంటరిగా తినడం మంచిది కాదని..దీనివల్ల ఒత్తిడి ముప్పు పొంచి ఉంటుందని చెప్పారు. తరచూ ఒత్తిడిలో ఉండటమనేది గుండెకు హాని కల్గిస్తుంది. కలిసి భోజనం చేయడం అలవాటు చేసుకుంటే..ఒత్తిడి తగ్గడమే కాకుండా..ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం, సోషల్ లివింగ్ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ తేడా పిల్లల్లో స్పష్టంగా కన్పిస్తుంది. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో అందరూ కలిసి తినడం కష్టమే అయినా సాధ్యమైనంతవరకూ ప్రయత్నించాలి.

అధ్యయనం ఏం చెబుతోంది

అధ్యయనంలో పాల్గొన్నవారిలో 65 శాతం మధ్యస్థాయి ఒత్తిడి, 27 శాతం మంది అధిక ఒత్తిడికి గురై ఉన్నారు. కుటుంబం, స్నేహితులు, బంధువులతో కలిసి భోజనం చేసే విషయమైన ప్రశ్నించినప్పుడు..పదిమందిలో ఏడుగురు కలిసి తిన్నప్పుడు ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. 

కలిసి భోజనం చేయడం వల్ల లాభాలు

కలిసి భోజనం చేసేటప్పుడు షేరింగ్ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంటామని 59 శాతం మంది తెలిపారు. ఎక్కువగా ఒంటరిగానే తింటుంటామని..కలిసి తినేందుకు అవకాశం ఉండటం లేదని చెప్పారు. కలిసి భోజనం చేయడం వల్ల సోషలైజేషన్ పెరుగుతోందని సర్వేలో తెలిసింది. కలిసి తినడం వల్ల కలిగే లాభాల్ని 67 శాతం మంది మంచిదని స్పష్టం చేశారు. 

Also read: Skin Care Tips: 30 ఏళ్లకే చర్మం కాంతి విహీనమౌతుందా..ఇలా చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News