Drinking Water In Copper Vessel: పూర్వీకులు ఎక్కువగా రాగి పాత్రలనే వాడేవారు. అందుకే అనారోగ్య సమస్యలు లేకుండా చాలా ఏళ్ల పాటు జీవించ గలిగారు. అయితే రాగి పాత్రల్లో నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రాగి పాత్రల్లో నీటి పోయడం వల్ల నీరు శుద్ధవుతాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఈ నీటిని తాగే ముందు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రాగి నీళ్లు తాగే ముందు ఏయే విషయాలను గుర్తుంచుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నేలపై పెట్టవద్దు:
చాలా మంది నిద్రపోయే ముందు నేలపై రాగి పాత్రను ఉంచుతారు. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ నీటిని తాగుతారు. ఇలా తాగడం హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాగి నీటిని నేలపై పెట్టి తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
ఆమ్లత్వం హానికరం:
రాగి నీరు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే అసిడిటీ ఉన్నవారు రాగి నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి:
ఉదయం పూట ఖాళీ కడుపుతో రాగి నీళ్లు తాగాలి. అన్నం తిన్న తర్వాత రాగి పాత్రల్లో ఉంచిన నీటిని తాగడం వల్ల హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఖాళీ కడుపుతో రాగి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యలు కూడా తగ్గుతాయి.
కేవలం ఇలానే రాగిపాత్రల్లో నీటిని ఉంచాలి:
రాగి నీటిని క్రమం తప్పకుండా తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రాగి పాత్రల్లో ఆ నీటిని కనీసం 8 గంటలపాటు ఉంచాల్సి ఉంటుంది. రాగి పాత్రలో 48 గంటల పాటు నీటిని నిల్వ చేసిన నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rain Alert For AP: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Also Read: LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి