Diabetes Control Tips: ఈ చట్నీతో ఎంతటి మధుమేహామైన సరే శ్వాశతంగా తగ్గటం ఖాయం!

Amla Chutney For Diabetes Control: మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఉసిరి చట్నీని ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 01:10 PM IST
Diabetes Control Tips: ఈ చట్నీతో ఎంతటి మధుమేహామైన సరే శ్వాశతంగా తగ్గటం ఖాయం!

Amla Chutney For Diabetes Control In 8 Days: ఆయుర్వేదంలో ఉసిరికాయకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఉసిరిలో శరీరానికి కావాల్సిన అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అందుకే వీటిని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఇందులో ఉండే పోషకాలు మధుమేహంతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వీటితో తయారు చేసిన ఊరగాయలను ప్రతి రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఉసిరి చట్నీ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే  ఉసిరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు:
>>8-10 ఉసిరికాయలు
>> అల్లం ముక్కలు
>> 4 టేబుల్ స్పూన్ల తరిగిన కొత్తిమీర
>> 4-5 లవంగాలు వెల్లుల్లి
>> 2-3 పచ్చిమిర్చి
>> 1 టీస్పూన్ ఆవాల నూనె
>> రుచికి సరిపడ ఉప్పు

ఉసిరి చట్నీ తయారి పద్దతి:

  1. ఉసిరి చట్నీ చేయడానికి ముందుగా ఉసిరికాయలను బాగా కడగాల్సి ఉంటుంది.
  2. వాటిని సన్నని ముక్కులగా కట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.
  3. కొత్తిమీర ఆకులను కూడా బాగా శుభ్రం చేసుకుని కట్ చేసుకోవాలి.
  4. తర్వాత పచ్చిమిర్చిని కూడా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  5. కొత్తిమీర, చ్చిమిర్చిని మిక్సీలో వేసి 1 నిమిషం పాటు గ్రైండ్ చేయండి.
  6. తర్వాత మిక్సీలో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, నూనె, ఉప్పు వేసి రుచికి సరిపడా వేసి ఫైన్‌గా ఫెస్ట్ చేసుకోవాలి.
  7. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమంలో ఉసిరి ముక్కలను వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి.
  8. ఇది ఫ్రిజ్‌లో ఉంచితే వారం నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News