Carrot Juice For Weight Loss: ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారాల్లో ఆకు కూరలతో పాటు క్యారెట్‌లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రతి రోజు క్యారెట్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా క్యారెట్‌లో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు శరీరాన్ని యాక్టివ్‌గా ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పరిమాణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి శరీర బరువును నియంత్రించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా డైట్‌లో క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు:
కంటి చూపు మెరుగుపడుతుంది:
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో లభించే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ అన్ని కంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు విటమిన్ ఎ లోపం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాకుండా దీని కారణంగా రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్యారెట్‌లో ఉండే విటమిన్ ఎ, సి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గింస్తుంది.
రక్తపోటును అదుపులో ఉంటుంది:
క్యారెట్ రసంలో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా గుండె జబ్బుల కారణంగా వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
శరీర బరువు తగ్గడానికి:
ప్రస్తుతం చాలా మంది శరీర బరువు తగ్గడానికి కష్టపడి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి తగిన ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేసి కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు క్యారెట్ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
మధుమేహం అదుపులో ఉంటుంది:
మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు క్యారెట్ రసం తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు మధుమేహంతో బాధపడేవారికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ప్రతి రోజు క్యారేట్ రసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook