Sweet Potato: ఇలా కందగడ్డను ప్రతి రోజూ తింటే చలి కాలంలో మధుమేహానికి చెక్‌..

Can Diabetes Patient Eat Sweet Potato: మధమేహంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడానికి తప్పకుండా పౌష్టికాహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 02:04 PM IST
Sweet Potato: ఇలా కందగడ్డను ప్రతి రోజూ తింటే చలి కాలంలో మధుమేహానికి చెక్‌..

Can Diabetes Patient Eat Sweet Potato: చలికాలంలో మన ఆరోగ్యానికి మేలు చేసే పౌష్టికాహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా మంచి పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. అయితే ఈ క్రమంలో చాలా మంది ఏమి తినాలో అని అయోమయంలో ఉంటారు. మరి కొందరైతే రక్తంలో చక్కెర పరిమాణాలు పెంచే చాలా రకాల ఆహారాలు తీసుకుంటుకుంటూ ఉంటున్నారు. కాబట్టి తప్పకుండా వీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చలి కాలంలో డయాబెటిస్ పేషెంట్లు చిలగడదుంప తినడం వల్ల కూడా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వాటిని ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చిలగడదుంపలో లభించే పోషకాలు ఇవే:
చిలగడదుంపలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, ఆరోగ్యకరమైన కొవ్వు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, కెరోటినాయిడ్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.  ఇందులో ఉండే  థయామిన్ సులభంగా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

మధుమేహ రోగులకు చిలగడదుంప ఎలా ఉపయోగపడుతుంది:
డైటీషియన్ ఆయుషి యాదవ్ ప్రకారం.. ఏదైనా ఆహారాన్ని ఉడికించే దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ అధారపడి ఉంటుంది. అధిక GI ఉన్న ఆహారాలు డయాబెటిక్ రోగులు తీసుకుంటే చాలా ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. చిలగడదుంపలో స్టార్చ్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి.

వీటిని ఎలా తినాలో తెలుసా?
కందగడ్డలో అధిక ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి మధుమేహంతో బాధపడేవారికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అయితే వీటిని ఉడికించి.. తొక్క తీసి తింటే రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: Ind Vs SL: సిరీస్‌ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..! 

Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News