How To Lower Blood Pressure: ప్రస్తుత కాలంలో చాలా మందిని బాధపెట్టే ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. ఈ సమస్య ఉన్నవారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, హార్ట్ స్ట్రోక్ వంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్యలు రావడానికి ముఖ్య కారణం జీవన శైలిలో మారిన ఆహార అలవాట్లు అని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు పోషకకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం, అంతేకాకుండా బీపీని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. అయితే ఇలాంటి నియమాలు పాటించడం వల్ల అధిక రక్తపోటును నియంత్రణ చేయగలము అనేది తలుసుకుందాం.
ముందుగా ఆహార విషయంలో అధికంగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు చేర్చుకోవడం ముఖ్యం. వీటితోపాటు ఆకుకూరలు, సోడియం కంటెంట్ పదార్థాలు తినాలి. వీటిని ఎందుకు తీసుకోవాలంటే ఇందులో రక్తపోటును నియంత్రించే ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ పదార్థాలు తినడం వల్ల అధిక రక్తపోటుతో పాటు అధిక బరువును కూడా నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆహారపదార్థాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది.
ఆహారంతో పాటు ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. కేవలం ఐదు రోజులపాటు క్రమం తప్పకుండా సైకలింగ్, వాకింగ్, స్విమ్మింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇలా చేయడం వల్ల శరీర కదలిక కారణంగా రక్తప్రసరణ, కొవ్వు తగ్గించుకోవచ్చు. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అధికరక్తపోటు ఉన్నవారు ఎల్లప్పుడు శాంతిగా ఉండాలి. ఒత్తిడి వల్ల మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆల్కహాల్, కెఫీన్, చెడు కొలెస్ట్రాల్ పదార్థాలు, కొవ్వు కూడా పదార్థాలకు దూరంగా ఉండాలి లేకుంటే గుండె సమస్యలు అలాగే అధిక రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. బయట లభించే సోడా, కూల్ డ్రింక్స్‌ను కూడా తీసుకోవడం మంచిది కాదు. స్వీట్‌లను కూడా తగ్గించడం మంచిది. అధికంగా చక్కెర తినడం వల్ల డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుంది.
అధిక రక్తపోటు సమస్యతో తీవ్ర ఇబ్బందితో బాధపడుతుంటే వెంటనే ఆరోగ్యనిపుణుల సలహ తీసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్లప్పుడు వైద్యుడు ఇచ్చిన మందులను టైమ్‌కు వేసుకోవడం మంచిది.
Also read: Immunity System: రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని తేలిపే 7 సంకేతాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter