Home Remdedies For Sleep: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా..ఈ టిప్స్ పాటించండి చాలు

Home Remdedies For Sleep: మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. నిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఈ టిప్స్ పాటిస్తే మాత్రం ప్రశాంతంగా నిద్రపోగలరు. అవేంటో చూద్దామా.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2021, 08:47 AM IST
  • రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం ప్రధాన సమస్యగా గుర్తింపు
  • ఫోన్ ఎక్కువగా చూడటం ఓ కారణమని వైద్యుల భావన
  • రాత్రి నిద్ర పట్టడానికి పాటించాల్సిన చిట్కా వైద్య పద్ధతులు
Home Remdedies For Sleep: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా..ఈ టిప్స్ పాటించండి చాలు

Home Remdedies For Sleep: మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. నిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఈ టిప్స్ పాటిస్తే మాత్రం ప్రశాంతంగా నిద్రపోగలరు. అవేంటో చూద్దామా.

రోజుకు 7-8 గంటల సేపు రాత్రి నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చాలామందికి వివిధ కారణాలతో రాత్రిళ్లు త్వరగా నిద్రపట్టదు. బెడ్‌పై గంటల కొద్దీ దొర్లుతూనే ఉంటారు కానీ నిద్రపోలేరు. కళ్లు మూసుకున్నా ఏదో ఆలోచనలు వెంటాడుతూ నిద్ర రావడం(Insomnia)లేదని లేచిపోతుంటారు. ఎప్పుడో అర్ధరాత్రో అపరాత్రో నిద్ర పడుతుంది. కొందరికి అది కూడా పట్టదు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఇలా నిద్రపట్టక బాధపడేవారు ఈ టిప్స్ పాటిస్తే(Home Remedies for Sleep)వెంటనే నిద్రపడుతుంది. అవేంటో చూడండి.

రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యి గోరు వెచ్చగా చేసుకుని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. ఇలా చేస్తా కచ్చితంగా నిద్ర పట్టే అవకాశాలున్నాయి. లేదా గసగసాల్ని దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించి వాసన పీలుస్తూ ఉండాలి. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తల వెంట్రుకల్ని మృదువుగా దువ్వుతూ లేదా చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేసినా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మర్దనా చేసుకున్నా నిద్ర పడుతుంది. అలా కాదనుకుంటే రాత్రి పూట (NIght Sleep)గోరు వెచ్చని పాలు..మిరియాల పౌడర్ కలుపుకుని తాగాలి. 

మరీ ముఖ్యంగా నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్(Mobile Phone)చూడటం మానేయాలి. అంతేకాదు రాత్రిళ్లు తల పక్కన మొబైల్ ఫోన్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావంతో కూడా సరిగ్గా నిద్ర రాదు. కాబట్టి మొబైల్ ఫోన్‌ను దూరంగా పెట్టడం చాలా మంచిది. రోజూ రాత్రి పడుకునేముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయడం లేదా మంచి మంచి దృశ్యాల్ని ఊహించుకుని మెమరైజ్ చేయడం అలవాటు చేసుకోంది. కచ్చితంగా ఫలితముంటుంది. లేదా శ్రావ్యమైన లలిత సంగీతాన్ని స్లో వాల్యూమ్‌లో పెట్టుకుని వింటూ ప్రశాంతంగా కళ్లు మూసుకుని ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది. 

Also read: Beautiful Athlete with Wild Bear: అడవి ఎలుగుబంటితో అందమైన ముద్దుగుమ్మ సావాసం, ఎందుకో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News