Anti Oxidants: అంటే ఏజీయింగ్ సమస్య చాలా తీవ్రంగా వెంటాడుతోంది. యౌవనంగా కన్పించేందుకు, చర్మం అందంగా మెరుగులు దిద్దేందుకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్ని వినియోగిస్తుంటారు. ఇవి పూర్తిగా సత్ఫలితాల్ని ఇవ్వకపోగా దుష్పరిణామాలు కూడా ఎదురుకావచ్చు.
సాధారణంగా మనం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల చర్మం త్వరగా వాడిపోతుంటుంది. ముడతలు పెరిగిపోతుంటాయి. అందుకే హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా మాత్రమే కోల్పోయిన అందాన్ని లేదా చర్మ నిగారింపును తిరిగి తెచ్చుకోగలం. వయస్సు 5 పదులు దాటినా నిత్య యౌవనం, చర్మం అందంగా ఉండాలంటే ముఖ్యంగా శరీరానికి 3 అతి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు అవసరమౌతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అనేవి సాధారణంగా పండ్లు, కూరగాయల్లో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తినడం వల్ల చాలావరకూ చర్మ సమస్యలు నయమౌతాయి. చర్మంలో ఏర్పడే ముడతలు, స్వెల్లింగ్ పూర్తిగా తగ్గుతుంది. చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన కిరణాల్నించి చర్మాన్ని పూర్తిగా రక్షిస్తాయి. ట్యానింగ్ సమస్యను పోగొడతాయి. పింపుల్స్ వంటి సమస్యలు దూరమౌతాయి.
శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటి విటమిన్ ఎ. చర్మ కణాల్ని సరిచేసేందదుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంపై పడే గీతలు, ముడతల్ని తగ్గిస్తుంది. చర్మానికి కొత్త నిగారింపును తెచ్చిపెడుతుంది. విటమిన్ ఎ కోసం ఆకుపచ్చ, ఎరుపు, పసుపు కూరగాయలు, పండ్లు తప్పకుండా తీసుకోవాలని డైటిషియన్లు సూచిస్తున్నారు. ఈ విటమిన్ రెండు రకాలుగా ఉంటుంది. కెరోటినాయిడ్, రెటినోయిడ్. శాకాహారంలో కెరోటినాయిడ్లు ఉంటే, మాంసాహారంలో రెటినోయిడ్లు ఉంటాయి.
మరో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి. చాలా రకాల వ్యాధుల్ని నయం చేసేందుకు ఈ విటమిన్ అద్భుతంగా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి జరగాలంటే విటమిన్ సి చాలా కీలకం. ముఖంపై ఏర్పడే డార్క్ సర్కిల్స్ దూరం చేయడంలో విటమిన్ సి కీలకంగా ఉపయోగపడుతుంది. ఉసిరి, నిమ్మ, జామ, నారింజ, కివీలో పెద్దమొత్తంలో లభిస్తుంది.
ఇక మరో కీలకమైన యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఇ. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించుకోవడం చాలా అవసరం. ఈ ప్రక్రియలో విటమిన్ ఇ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చర్మానికి తేమ, లూబ్రికేషన్ అందించడమే కాకుండా చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. దీనికోసం బాదం, వాల్‌నట్స్, ఎండు ద్రాక్ష, సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి కాయ గింజలు డైట్‌లో చేర్చాలి.
Also read: Low Blood Pressure: తక్కువ రక్తపోటు ఉన్నవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook