Benefits Of Saffron For Men: కుంకుమపువ్వు చర్మ సౌందర్యం నుంచి శరీరం వరకు అనేక రకాల సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.ఇందులో శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ మొదలైన అనేక రకాల పోషకాలు ఉంటాయి. కుంకుమపువ్వు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం ఫిట్‌గా తయారవుతుంది. కుంకుమ పువ్వు స్త్రీల కంటే పురుషులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే కుంకుమ పువ్వును పాలలో తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
శారీరక బలహీనత:
కుంకుమపువ్వు పాలలో వేసుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. శారీరక బలహీనత కూడా సులభంగా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
శీఘ్రస్కలనం సమస్య:
కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల శీఘ్రస్కలన సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది పురుషులలో మానసిక ఒత్తిడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇలా పాలను తాగొచ్చు.
లైంగిక శక్తి:
కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల పురుషులలో లైంగిక కోరికలు పెరుగడమేకాకుండా టెన్షన్ వంటి సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పువ్వులను పాలలో కలుపుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే వీర్యకణాల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!
Also Read: Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుడిగా అలీ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook