Uses Of Mint: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సి డ్రింక్‌.. అద్భుతమైన లాభాలు మీసొంతం!

Benefits Of Mint: వేసవికాలంలో ఆరోగ్యకరమైన డ్రింక్‌ను తీసుకోవాలి అంటే పుదీనా వాటర్‌ ఎంతో మంచి ఎంపిక అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2024, 05:33 PM IST
Uses Of Mint: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సి డ్రింక్‌.. అద్భుతమైన లాభాలు మీసొంతం!

Benefits Of Mint: వేసవిలో చాలా మంది అధిక ఉష్ణోగ్రతల వల్ల బాధపడుతుంటారు. ఈ సమయంలో చల్లగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయి, అందులో ఒకటి పుదీనా నీరు తాగడం. పుదీనా ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, ఇవి వేసవిలో శరీరానికి చాలా మంచివి.  ఇందులో బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇది కొన్ని ఆరోగ్య సమస్యలకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే సమ్మర్‌లో పుదీనా వాటర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.

పుదీనా నీటి  ప్రయోజనాలు:

పుదీనా ఆకులకు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇవి ఇవి జీర్ణక్రియ ఎంజైమ్ల స్రావాన్ని ప్రేరేపిస్తాయి. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు  పుదీనా ఆకులు నేరుగా తీసుకోవచ్చు లేదా పుదీనా వాటర్‌గా తీసుకోవచ్చు. దీని వల్ల ఆకలి నియంత్రంచడంలో, ఆహారం జీర్ణం అవ్వడంలో సహాయపడుతుంది. ఈ పుదీనా వాటర్ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది  వేసవిలో కలిగే దాహాని తగ్గిస్తుంది. రోజంతా శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. 

పుదీనా ఆకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. పుదీనా ఆకుల్లోని మెంథాల్‌ వేసవిలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పుదీనా చర్మాన్ని వేసవిలో పొడి బారకుండా హైడ్రెడ్ గా ఉండేలా చేస్తుంది. ఈ పుదీనా ఆకులు శరీరంలో ఉండే టాక్సిన్‌ను శుభ్రమ్ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పుదీనా వాటర్‌ని ఉపయోగించి నోటి దుర్వాసన నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. 

పుదీనా నీరు ఎలా తయారు చేయాలి:

ఒక గ్లాసు నీటిలో 4-5 పుదీనా ఆకులను వేసి 5 నిమిషాలు మరిగించాలి. నీటిని చల్లబరచండి మరియు రుచికి తగినంత నిమ్మరసం లేదా తేనె కలపండి. మీరు కోరుకుంటే, మీరు పుదీనా నీటిలో కొన్ని ముక్కలు దోసకాయ లేదా నిమ్మకాయ కూడా వేయవచ్చు.

పుదీనా నీటిని రోజులో ఎప్పుడు తాగాలి:

పుదీనా నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది.
మీరు దీన్ని భోజనాల మధ్య కూడా తాగవచ్చు.

ఈ విధంగా పుదీనా ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మీరు కూడా మీ డైట్‌లో చేర్చుకోండి. ఈ వేసవిలో బయట లభించే కూల్‌ డ్రింక్స్‌ కంటే ఆరోగ్యకరమైన ఈ పుదీనా నీటిని ఉపయోగించండి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News