Anti Ageing Tips: 46 ఏళ్లైనా తరగని సుశ్మితా సేన్ అందం వెనుక సీక్రెట్ ఇదే, మీరూ వాడి చూడండి

Anti Ageing Tips: ఆధునిక జీవనశైలిలో ఏజీయింగ్ ప్రధాన సమస్యగా మారుతోంది. తక్కువ వయస్సుకే వృద్ధాప్యం మీడపడుతోంది. అదే సమయంలో సుశ్మితా సేన్ వంటి సెలెబ్రిటీలు 5 పదులు సమీపిస్తున్నా నిత్య యౌవనంతో మెరిసిపోతున్నారు. కారణమేంటి, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2023, 03:03 PM IST
Anti Ageing Tips: 46 ఏళ్లైనా తరగని సుశ్మితా సేన్ అందం వెనుక సీక్రెట్ ఇదే, మీరూ వాడి చూడండి

Anti Ageing Tips: బాలీవుడ్ నటి సుశ్మితా సేన్ గురించి తెలియనివారెవరకూ ఉండరు. 1994లో మిస్ యూనివర్శ్ టైటిల్ సాధించిన సుశ్మితా సేన్ అందం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇక ఫిజిక్ అయితే ఫిట్ అండ్ స్లిమ్. సుశ్మితా సేన్ అందం వెనుక రహస్యమేంటో తెలుసుకుందాం..

సుశ్మితా సేన్ వయస్సు 5 పదులు సమీపిస్తోంది. ప్రస్తుతం 46 ఏళ్ల వయస్సులో ఉన్న ఆమె ఇప్పటికీ నిత్య యౌవనంతో మెరిసిపోతుంటుంది. వృద్దాప్య ఛాయలు మచ్చుకైనా కన్పించవు. అటు ఫిజిక్ కూడా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటుంది. ఈమె అందం వెనుక రహస్యమేంటని పరిశీలిస్తే ఆమె వినియోగించే స్పెషల్ ఫేస్ స్క్రబ్ గురించి తెలుస్తుంది. కేవలం శెనగపిండి, మలాయ్ సహాయంతో తయురు చేస్తారు. శెనగపిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తే..మీగడ డీప్ మాయిశ్చరైజ్ చేస్తుంది.

46 ఏళ్ల వచ్చినా పిటపిటలాడే యౌవనం సుశ్మితా సేన్ సొంతం. 94 ఏళ్ల క్రితం టైటిల్ గెల్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికే అదే శరీర సౌష్ఠవం. అదే ఫిజిక్. అదే అందం. షూటింగులతో బిజీగా ఉన్నా సరే చర్మ సంరక్షణ ఎలా చేస్తుందనేది వివరించింది. అదే సుశ్మితా సేన్ స్పెషల్ ఫేస్ స్క్రబ్ అది. దీనిని తయారు చేయాలంటే శెనగపిండి, మీగడ అవసరమౌతాయి. ఈ వివరాలు మీ కోసం..

సుశ్మితా సేన్ స్పెషల్ ఫేస్ స్క్రబ్ తయారీ ఎలా

దీనికోసం 2 కప్పుల శెనగపిండి, ఒక కప్ మీగడ అవసరమౌతాయి. ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల శెనగపిండి వేసి ఒక కప్పు మీగడ వేసి కలపండి. ఆ తరువాత ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. రోజ్ వాటర్ లేదా మీగడతో ఎలర్జీ ఉంటే అల్లోవెరా ఉపయోగించుకోవచ్చు. ఈ మూడింటినీ బాగా కలుపుకుంటే చాలా మీక్కావల్సిన ఫేస్ స్క్రబ్ సిద్ధం.

ఫేస్ స్క్రబ్ రాసేముందు ముఖాన్ని శుభంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఫేస్ స్క్రబ్‌ను ముఖానికి బాగా పట్టించాలి. ఆ తరువాత మీ వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. దాదాపు ఓ అరగంట అలానే వదిలేయాలి. ఆ తరువాత సాధారణ నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే చాలు అందం మెరిసిపోతుంది.

Also read: Desi Ghee Benefits: దేశీ నెయ్యితో దిమ్మతిరిగే ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే తినకుండా ఉండలేరు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News