Basil Water Benefits: పూర్వీకుల కాలం నుంచి తులసి చెట్టును పూజించడం ఆనవాయితీగా వస్తోంది. తులసిని పూజించడమే కాకుండా ఔషధ మూలకంగా కూడా వినియోగిస్తారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా అతి ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యల నుంచి కూడా తులసి విముక్తి కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కాఫీ టీలకు బదులుగా తులసిని ఉడికించిన నీటిని తీసుకోవడం వల్ల అనేకరకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా ఈ తులసి నీటిని శీతాకాలంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వాతావరణంలోని తేమ పెరగడం, తగ్గడం కారణంగా కొంతమందిలో అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివారు తప్పకుండా తులసి నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నీటిని తాగడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం:
వాతావరణంలో మార్పుల కారణంగా పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు దగ్గు జలుబు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమందిలోనైతే అనేకరకాల వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తులసిని ఉడికించి దాని నుంచి తీసిన నీటిని తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శరీరం ఫిట్‌గా తయారవుతుంది:
రోజు ఉదయాన్నే తులసిని నీటిలో మరిగించి, ఆ నీటిని తాగితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరం కూడా ఫిట్ గా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ నీటిలో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.
షుగర్ లెవెల్స్ కంట్రోల్..
మధుమేహంతో బాధపడే వారిలో తరచుగా రక్తంలోని చక్కర పరిమాణాలు పెరుగుతూ..తగ్గుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే పచ్చి తులసి ఆకులను నమిలి మింగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీనితో తయారుచేసిన నీటిని తాగడం వల్ల కూడా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చు.
మోకాలి నొప్పిల నుంచి ఉపశమనం:
ఆయుర్వేద గుణాలు కలిగిన తులసిటీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు మోకాళ్ళ నొప్పు నుంచి తక్షణ ఉపశమనం లభించేందుకు సహాయపడతాయి. కాబట్టి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ టీని తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter