Applying Ghee On Face Overnight: వయస్సు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు ముఖంపై ముడతలు కూడా వస్తాయి. కొంత మందిలో చర్మం వదులుగా మారుతుంది. అయితే ఇలాంటి సమస్యలు చిన్న వయస్సు వారిలో కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు కొన్ని తప్పుడు అలవాట్ల వల్ల కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ఇంటి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నెయ్యిని వినియోగించడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. నెయ్యిని ముఖానికి రాసుకోవడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు నయమవుతాయి. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
నెయ్యి చర్మానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?:
దేశి నెయ్యిలో చర్మానికి కావాల్సిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. కాబట్టి నెయ్యిని ముఖానికి అప్లై చేస్తే ముఖం ముడుతలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కుంగిపోయిన చర్మాన్ని కూడా బిగుతుగా చేస్తుంది. దేశీ నెయ్యి చర్మ రంధ్రాలలో తేమను నింపుతుంది. అంతేకాకుండా కొల్లాజెన్‌ని పెంచుతుంది. ముఖంపై ఉండే లేత గీతలు మాయమవుతాయి.అంతేకాకుండా ముఖంపై ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ నెయ్యిని వినియోగించాల్సి ఉంటుంది.
రాత్రి ముఖం మీద నెయ్యి ఎలా రాయాలి:
రాత్రి పడుకునే ముందు దేశీ నెయ్యి చేతిలోకి తీసుకోవాలి.
తర్వాత రెండు చేతులతో బాగా కలపాలి.
తర్వాత ఇలా మీ ముఖానికి అప్లై చేయండి.
తేలికపాటి చేతులతో ముఖాన్ని కాసేపు మసాజ్ చేయండి.
దీని తర్వాత ముఖం కడుక్కోకుండా నిద్రపోండి.
ఉదయాన్నే లేచి చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లో చర్మం బిగుతుగా మారుతుంది.
మెరిసే చర్మం కోసం:
మీ ముఖాన్ని బిగుతుగా చేయడంతో పాటు, చర్మాన్ని మెరిపిస్తుంది. దీని కోసం మీ ముఖానికి దేశీ నెయ్యిని అప్లై చేసి, కాసేపు మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను పెంచి ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా పొడి చర్మం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు ముఖాన్ని కంతివంతంగా చేస్తుంది.
Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Faceboo