mint leaves benefits for skin: ప్రస్తుత కాలంలో చాలా మంది అందంగా కనిపించడానికి వివిధ రకాల ఫేస్ ప్రొడెక్ట్స్‌ను వాడుతుంటారు. దీనిని ఉపయోగించడం వల్ల చర్మం నల్లగా, మొటిమల, ట్యాన్ బారిన పడుతుంటారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మందులను కూడా వాడుతుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ప్రొడెక్ట్స్ లేకుండా ఆరోగ్యకరమైన చర్మంను పొందవచ్చని చర్మ వైద్యులు అంటున్నారు. దీనిపై మనం తెలుసుకుందాం.
పుదీనాను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. పుదీనాతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తాం. దీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుదీనాను వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేసుకోవచ్చు. అయితే కాకుండా అందాన్ని మెరుగుపరచడంలో కూడా పుదీనా మనకు సహాయపడుతుంది. పుదీనా వాడడం వల్ల ముఖంపై ఉండే ట్యాన్, నలుపు రంగును తొలగించుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలి..? అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also read: Side Effects Of Spinach: బచ్చలికూరతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఏంటి నమ్మట్లేదా?
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో పుదీనా..
తాజాగా ఉండే పుదీనా ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి.వీటిని పేస్ట్‌లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ చెక్కర వేసి బాగా మిక్స్ చేయాలి. దీనిని ఐదు నిమిషాల పాటు ముఖానికి పెట్టుకొని మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత చల్ల నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా పుదీనాను ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే మొటిమలను, నలుపు రంగును, చర్మంపై ఉండే మురికిని తొలగిస్తుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు వాడడం వల్ల ముఖం అందంగా ఉంటుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Also read: Winter Solstice 2023: ఇవాళే వింటర్ సోల్స్‌టిస్, ఏడాదిలో లాంగెస్ట్ నైట్, ఎందుకలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి