Horse Gram Health Benefits: ఉలవలు అనేది నవధాన్యాలలో ఒకటి. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి కావాలసిన పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉలవలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుందాం.
☛ ఉలవలు తీసుకోవడం వల్ల మెరుగైన ఆరోగ్యని పొందవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్ అధికంగా దొరుకుతాయి. ఇది చిన్న పిల్లలు తినడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు.
☛ కొంద మంది ఆకలిలేమి సమస్యతో బాధపడుతుంటారు. వీరు ఉలవలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
☛ శీతాకాలంలో వచ్చే కఫ దోష సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
☛ ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో వచ్చే రాళ్లు సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
☛ అంతేకాకుండా ఉలవలు తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ కంటెంట్ లభిస్తుంది. దీని వల్ల మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
☛ పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమయంలో ఉలవల చారు చేసుకొని తినడం వల్ల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు
Also read: Top 4 Lipstick Shades: బడ్జెట్ ధరలో లభించే టాప్ 4 లిప్‌స్టిక్ షేడ్స్..
☛ ఉలవలను, బియ్యాన్ని కలిపి జావగా తయారు చేసుకొని తాగడం వల్ల లైంగిక సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీనితో పాటు పాలను కూడా రాత్రి పూట తీసుకోవాలి.
☛ కీళ్ల సమస్యతో బాధపడుతున్నవారు ఉలవలను వేడి చూసి కాటన్ క్లాత్ మూట కట్టాలి. దీనిని నొప్పులు , వాపులు ఉన్న చోట కాపడం పెట్టుకోవడం మేలు జరుగుతుంది.
☛ ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.
☛ నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నవారు ఉలవలు తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.
☛ ఉలవలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
అంతేకాకుండా వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అలాంటి సమయంలో చల్లని మజ్జిగ లేద పాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Horse Gram: ఉలవ కట్టుతో లైంగిక సమస్యలు తగ్గుతాయా..? నిపుణులు ఏం అంటున్నారు అంటే..