మళ్లీ తన పేరు మార్చుకున్న యడ్యూరప్ప

మళ్లీ తన పేరు మార్చుకున్న యడ్యూరప్ప

Last Updated : Jul 26, 2019, 04:30 PM IST
మళ్లీ తన పేరు మార్చుకున్న యడ్యూరప్ప

బెంగళూరు: కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప మరోసారి తన పేరులోని అక్షరాలను మార్చుకున్నారు. ఆంగ్లంలో ప్రస్తుతం ఆయన పేరును Yeddyurappa గా రాస్తుండగా తాజాగా తన పేరును Yediyurappa గా మార్చుకున్నారు. యడ్యూరప్ప పేరుని రాయడంలో తప్ప ఉచ్చరించడంలో ఎటువంటి తేడా ఉండదు. వాస్తవానికి ఆరు నెలల క్రితమే యడ్యూరప్ప తన పేరును  Yediyurappa గా మార్చుకున్నట్టు తెలుస్తోంది. 

2007కి ముందు ఆయన పేరు Yediyurappa నే కాగా అప్పట్లో అదృష్టం కలిసి రావడం లేదనే కారణంతో ఆయన తన పేరును Yeddyurappa గా మార్చుకున్నారు. అప్పటి నుంచి అదే పేరుతో కొనసాగుతున్న యడ్యూరప్ప.. ఆరు నెలల క్రితమే మళ్లీ పాత పద్ధతిలోకే తన పేరును మార్చుకున్నట్టు సమాచారం అందుతోంది.

Trending News