Written test for Sarpanch candidates: సర్పంచ్ పదవికి పోటీచేసే అభ్యర్థులకు రాతపరీక్షలు (written test) నిర్వహించారు గ్రామస్థులు. ఈ ఎగ్జామ్ లో ఎవరైతే పాస్ అవుతారో వారికే ఓట్లు వేస్తామని చెప్పారు. 7 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం రూపొందించగా..8 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మీరు గెలిస్తే రానున్న ఐదేళ్లలో చేసే అభివృద్ధి పనులేంటి? ఇప్పుడు ఇంటింటికీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు... గెలిచిన తర్వాత మమ్మల్ని పలకరించేందుకు వస్తారా? గత ఐదేళ్లలో మీరు చేసిన సమాజ సేవలు ఏమిటి? వంటి ప్రశ్నలు అందులో ఉన్నాయి. ఈ ఘటన ఒడిశా (Odisha) రాష్ట్రంలోని చోటు చేసుకుంది.
సుందర్ గడ్ జిల్లా కుత్రా పంచాయతీ (Kutra gram panchayat) మలుపడ గ్రామంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థులందరూ సమావేశమయి..ఓ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచి అభ్యర్థి పదవికి పోటీచేసే అభ్యర్థులు రాతపరీక్షలు రాయాలని వారు కండిషన్ పెట్టారు. దీంతో కొంతమంది పోటీ నుంచి తప్పుకోగా..చివరికి ఎనిమిది మంది పోటీలో నిలిచారు. ఇందులో ముగ్గురు ఉత్తీర్ణులయ్యారు. ఐదుగురు ఫెయిల్ అయ్యారు. ఈ ముగ్గురిలో గ్రామస్థులు ఎవరికి ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గ్రామస్థులు అభ్యర్థుల వాగ్దానాలు విని విసిగిపోయారని.. అందుకే వారిని ఇలా రాతపరీక్ష ద్వారా పరీక్షించాలని నిర్ణయించుకున్నారని గ్రామానికి చెందిన యువకులు తెలిపారు.
Also Read: Viral Video: చీర కోసం ఇంత రిస్కా తల్లి.. కొడుకు ప్రాణాలు పోయేవిగా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook