వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో మోదీ ప్రసంగ విశేషాలు

దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్న ఆయన ప్రసంగంలోని పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం ప్రత్యేకం

Last Updated : Feb 12, 2018, 01:21 PM IST
వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో మోదీ ప్రసంగ విశేషాలు

దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్న ఆయన ప్రసంగంలోని పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం ప్రత్యేకం

*దుబాయ్ ఒక గొప్ప మహిమ గల ప్రాంతం. ఎడారి ప్రాంతం నుండి ఒక గొప్ప మెట్రోపోలీస్ నగరంగా పురోగమనం చెందుతోంది. 

*టెక్నాలజీ వల్ల కొన్ని సందర్భాలలో అభివృద్ధి సాధ్యమైనా విపరీతాలు, అనర్థాలు కూడా జరిగే అవకాశం ఉంది

*పర్యావరణ పరిరక్షణకు నేను ఆరు సూత్రాలను నమ్ముతాను. పర్యావరణం పట్ల బాధ్యతతో మెలిగేవారు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్, రీడిజైన్ మరియు రీమాన్యుఫేక్చర్ అనే ఆరు విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి

*మానవుల ఉనికిని కాపాడుకోవడానికి అభ్యు్న్నతి మాత్రమే లక్ష్యం కాకూడదు. తాము సంతోషంగా ఉండాలి.. తమతో పాటు అందరూ సంతోషంగా ఉండాలనే భావనతో పనిచేయాలి. సంతోషమే మానవునికి గొప్ప బలం

*ఇండియా ప్రయోగాత్మకంగా చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ఎంత విజయవంతమైంది అంటే.. అలాంటి విజయాన్ని మీరు హాలివుడ్ చిత్రాల్లో కూడా చూసి ఉండరు. మీరు ఇండియాలో ట్యాక్సీ ఎక్కితే కిలోమీటరుకి 10 రూపాయల వరకు ఛార్జీ చేస్తారు. కానీ మా మిషన్ మార్స్ వరకు వెళ్లడానికి మేము కిలోమీటరుకి 7 రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టాం

*భారతదేశం నేడు సౌరశక్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించే దిశగా పనిచేస్తుంది. గత 3 సంవత్సరాల్లో మేము 62 గిగావాట్ల శక్తిని జనరేట్ చేశాం. భవిష్యత్తు అంతా కూడా సౌరశక్తి మీదే ఆధారపడి ఉంటుందని మేము నమ్ముతున్నాము

*రైతులు తన నేల ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవాలి. నేలను కూడా కన్నబిడ్డల్లా సాకాలి. అందుకే వారి కోసం సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం

*మా ప్రభుత్వ మంత్రం "సబ్కా సాత్.. సబ్కా వికాస్" అని చెప్పగలను. 

*భవిష్యత్తులో టెక్నాలజీ ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందంటే.. అది భూకంపాలను కూడా ఆపే శక్తిని తయారుచేస్తుంది

*200 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని 94 శాతం జనాభా కటిక పేదరికంలో కొట్టుమిట్టాడేది. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. పేదరికాన్ని రూపుమాపడానికి అందరూ కంకణం కట్టుకున్నాం.

*దాదాపు ప్రపంచంలోని సగానికి పైగా జనాభా బాగా జీవిస్తున్నారు. ఇదంతా టెక్నాలజీ వల్లే సాధ్యమైంది.

Trending News