భారత్‌లో ఈ ఏడాది వృద్ధి రేటు 7.3%: ప్రపంచ బ్యాంకు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలపై ప్రపంచ బ్యాంకు హర్షం వ్యక్తం చేసింది

Last Updated : Jan 10, 2018, 11:32 AM IST
భారత్‌లో ఈ ఏడాది వృద్ధి రేటు 7.3%: ప్రపంచ బ్యాంకు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలపై ప్రపంచ బ్యాంకు హర్షం వ్యక్తం చేసింది. సాహసోపేత నిర్ణయాల ఫలితంగా ఈ ఏడాది భారత వృద్ధిరేటు 7.3- 7.8% ఉండవచ్చని అంచనా వేసింది. రాబోయే దశాబ్దంలో భారత్ ప్రధాన ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా మారుతుందని తెలిపింది. ఈ క్రమంలో జీఎస్టీ, నోట్లరద్దు ప్రతికూల ప్రభావాలు దీర్ఘకాలికంగా ఉండవని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 

రాబోయే 10 సంవత్సరాల్లో భారత్ వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. బ్యాంకింగ్ రీకాపిటలైజేషన్ ప్రోగ్రాం చాలా ముఖ్యమైనదిగా, జీఎస్టీని మలుపుతిప్పిన అంశంగా తెలిపింది. 

"భారతీయ ప్రభుత్వం సమస్యల్లో కొన్నింటిని ఇప్పటికే గుర్తించి చర్యలు తీసుకుంది. ఈ చర్యల ఫలితాలను చూడడానికి కూడా సిద్ధంగా ఉంది. భారతదేశం చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ దేశం చాలా శక్తిమంతమైంది. అక్కడి ప్రభుత్వానికి ఆ సవాళ్లను గురించి బాగా తెలుసు. వాటితో వ్యవహరించే విషయంలో ఉత్తమంగా వ్యవహరిస్తోంది" అని ప్రపంచ బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు.

Trending News